📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

కాంగ్రెస్‌ మరోసారి నవ్వులపాలైంది – కిషన్ రెడ్డి

Author Icon By Sudheer
Updated: November 24, 2024 • 12:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయి..మరోసారి నవ్వులపాలైందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి 251 స్థానాల్లో విజయం సాధించి కాంగ్రెస్ ను చిత్తూ చేసింది. కాంగ్రెస్ ఉచిత పథకాలకు ప్రజలు ఏమాత్రం ఇష్టపడలేదు. ఈ ఫలితాలతో బిజెపికి ఇక తిరుగులేదని మరోసారి రుజువైనట్లు అయ్యింది. ఈ ఫలితాలపై కిషన్ రెడ్డి స్పందించారు.

దేశ ప్రజల ముందు కాంగ్రెస్‌ మరోసారి నవ్వులపాలైందని, ఇండియా కూటమికి మహారాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రాహుల్‌గాంధీ విద్వేష ప్రచారం చేశారని, కులం, మతం పేరుతో ప్రజలను విడగొట్టే ప్రయత్నం చేసినా మహారాష్ట్రలో బీజేపీ హ్యాట్రిక్‌ కొట్టిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి చేసిన ప్రచారం, ఆయన పంపిన డబ్బులు మహారాష్ట్రలో పని చేయలేదని వ్యాఖ్యానించారు. గ్యారంటీలతో మోసం చేసిన కాంగ్రెస్​ తెలంగాణ, కర్ణాటక, హిమాచల్​ ప్రదేశ్​లకే పరిమితమైందని కిషన్​రెడ్డి పేర్కొన్నారు. గత ఎన్నికల్లో సొంతంగా 44 సీట్లు గెలిచిన కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రేతో పొత్తు పెట్టుకున్న తర్వాత కనీసం సగం సీట్లు కూడా సాధించలేకపోయిందని అన్నారు. ఎమ్మెల్యేలను తెలంగాణ, కర్ణాటకకు తరలించాలని ప్లాన్​ చేశారని పేర్కొన్నారు. రాజకీయ అవకాశవాదం తలకెక్కిన ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, కాంగ్రెస్​కు మహారాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు.

ఈవీఏంల ట్యాంపరింగ్ జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ గెలవకపోతే ఈవీఏంల ట్యాంపరింగ్ జరిగినట్లా అని కిషన్​రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్​తో జతకట్టిన ఉద్ధవ్ ఠాక్రేకు ప్రజలు బుద్ధి చెప్పారని, మహారాష్ట్ర ప్రజలు వారసత్వాన్ని చూడలేదని పేర్కొన్నారు.

Kishan Reddy maharashtra results

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.