📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

ఇదే నా చివరి ఎన్నికల సమావేశం :రాజీవ్‌ కుమార్‌

Author Icon By Vanipushpa
Updated: January 7, 2025 • 4:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సీఈసీగా ఇదే నా చివరి ఎన్నికల మీడియా సమావేశమని సీఈసీ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన విషయం తెలిసినదే. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా త్వరలోనే తన పదవీకాలం ముగియబోతుందని రాజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు. రాజీవ్ కుమార్ ఈ ఏడాది ఫిబ్రవరిలో పదవీ విరమణ చేయనున్నారు. విలేకరుల సమావేశంలో ఈవీఎంలతో పాటు అదనపు ఓట్ల వరకు ఎన్నికల కమిషన్‌పై వచ్చిన ఆరోపణలపై ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.

రాజీవ్‌ కుమార్‌ 15 మే 2024న రాజీవ్ కుమార్ 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. సెప్టెంబర్‌ 1 సెప్టెంబర్ 2020 నుంచి ఎన్నికల కమిషన్‌గా ఎన్నికల సంఘంతో అనుబంధం ఉంది. ఆయన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సమయంలో 2020లో బీహార్ రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు జరిగాయి. కోవిడ్‌ సమయంలోనూ ఉత్తరప్రదేశ్ సహా మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌తో సహా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించారు.

1984 బ్యాచ్ ఐఏఎస్‌ అధికారిగా
రాజీవ్ కుమార్ 1960 ఫిబ్రవరి 19న జన్మించారు. ఆయన 1984 బ్యాచ్ ఐఏఎస్‌ అధికారి. దాదాపు 36 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో పని చేశారు. కేంద్రంలోని అనేక మంత్రిత్వశాఖలతో పాటు బిహార్‌, జార్ఖండ్‌ కేడర్‌లోనూ చాలాకాలం పాటు సేవలందించారు. సామాజిక, పర్యావరణ-అటవీ, మానవ వనరులు, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల్లోనూ సేవలందించారు. ఆయన ఫిబ్రవరి 2020లో కేంద్ర ఆర్థిక కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. రాజీవ్ కుమార్ సెప్టెంబర్ 1, 2020న ఎన్నికల కమిషన్‌లో కమిషనర్‌గా నియామకమయ్యారు.

chief election commissioner rajiv kumar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.