ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షలు లభ్యం..ఎక్కడివో తెలుసా..?

Read Time:  1 min
Rs.20 lakhs is available in
Rs.20 lakhs is available in
FONT SIZE
GET APP

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షలు లభ్యం కావడం అందర్నీ షాక్ కు గురిచేసింది. కాకపోతే ఇదంతా కూడా దొంగసొమ్ము అని తేలింది. ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లో తాను పనిచేస్తున్న ఓ కంపెనీలో రూ.20 లక్షలకు పైగా నగదు దొంగతనం చేశాడు. ఈ డబ్బుని తన బావకు ఇచ్చి స్వగ్రామానికి పంపించాడు. కంపెనీ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన హైదరాబాద్ పోలీసులు దర్యాప్తులో భాగంగా ఒడిశా వెళ్లారు. అక్కడి పోలీసుల సాయం తీసుకొని… బాలాసోర్ జిల్లాలో ఉన్న అతడి విచారించగా.. నిందితుడి అత్తమామల ఇంట్లోని ఆవు పేడ కుప్పలో ఈ డబ్బును దాచిపెట్టినట్టు గుర్తించారు. కొట్టేసిన నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు. కమర్డ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాదమందరుని గ్రామంలో రికవరీ చేసినట్లు వివరించారు.

డబ్బు కొట్టేసిన నిందితుడు పేరు గోపాల్ బెహెరా అని, అతడి అత్తమామల ఇంట్లో సోదాలు నిర్వహించామని చెప్పారు. గోపాల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న వ్యవసాయ అనుబంధ కంపెనీలో పనిచేస్తూ లాకర్‌లో ఉన్న రూ.20 లక్షలకు పైగా నగదు దొంగతనం చేశాడని వెల్లడించారు. డబ్బుని తన బావ రవీంద్ర బెహెరా చేతికి ఇచ్చి గ్రామానికి పంపించాడని, కంపెనీ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా డబ్బు పట్టుబడిందని కమర్డ పోలీస్ స్టేషన్ ఐఐసీ ప్రేమదా నాయక్ ప్రకటించారు. నిందితులు గోపాల్, అతడి బావ రవీంద్ర ఇద్దరూ పరారీలో ఉన్నారని పేర్కొన్నారు.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.