📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

అతుల్ ఆత్మహత్య కేసులో సుప్రీంకోర్ట్ విచారం

Author Icon By Vanipushpa
Updated: December 12, 2024 • 3:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అతుల్ కేసు తీవ్ర సంచలనంగా మారింది. ఈ కేసుకింద నమోదయినా సెక్షన్ 498ఏపై చర్చకు దారితీసింది. ఈ సెక్షన్ దుర్వినియోగంపై స్వయంగా సుప్రీంకోర్టే ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి అతుల్ లాయర్ దినేశ్ మిశ్రా కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. కుటుంబ న్యాయస్థానం ఆదేశాలతో సంతృప్తి చెందకపోతే ఆశ్రయించేందుకు మరిన్ని ఫోరమ్‌లు ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
అతుల్ ఆత్మహత్యపై అడ్వకేట్ ఆన్ రికార్డ్ (ఏవోఆర్) నిశాంత్ కేఆర్.శ్రీవాస్తవ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు కఠినమైన, సుదీర్ఘ న్యాయవిచారణ, ఆలస్యమైన న్యాయవిధానం వంటివి ఇటువంటి ఘటనలకు కారణమవుతున్నట్టు అభిప్రాయపడ్డారు. వరకట్న వేధింపులకు సంబంధించిన సెక్షన్ 498ఏ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు తక్షణ సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని క్రిమినల్ లాయర్ వికాశ్ పహ్వా తెలిపారు. అతుల్ కేసును ఆయన ‘చాలా తీవ్రమైనది’గా అభివర్ణించారు.
భార్యాభర్తలిద్దరూ ఆర్థికంగా స్థిరపడినవారేనని, అతుల్ భార్య ఢిల్లీలో బాగానే సంపాదిస్తోందని, బెంగళూరులో అతుల్ నెలకు రూ. 84 వేలు సంపాదిస్తున్నాడని పేర్కొన్నారు. అయితే, కుమారుడి పోషణ కోసం నెలకు రూ. 40 వేలు చెల్లించాలని అతుల్‌ను కుటుంబ న్యాయస్థానం ఆదేశించినట్టు తెలిపారు. మిగతా రూ. 44 వేలతో అతుల్ బెంగళూరులో అద్దెలు కట్టుకుని, కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా మారిందని పేర్కొన్నారు. ఆమె బాగా సంపాదించి, స్థిరపడి ఉన్నందున విడిపోయిన భార్యకు భరణం చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశించలేదని లాయర్ దినేశ్ మిశ్రా తెలిపారు. ఫ్యామిలీ కోర్టు ఆదేశాలపై అతుల్ సంతృప్తి చెందకుంటే పై కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని చెప్పారు.
ఇలాంటి కేసులు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత వుంది. కింది కోర్టులు సంతృప్తి తీర్పులు ఇవ్వనపుడు పైకోర్టులను ఆశ్రయి చవచ్చు అని సుప్రీంకోర్టు తెలిపింది.

#athul subhah Supreme Court

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.