My successor will be born there.. Dalai Lama

అక్కడే నా వారసుడు జన్మిస్తాడు : దలైలామా

బీజీంగ్‌: టిబెట్‌ బౌద్ధగురువు దలైలామా కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా బయటే తన వారసుడు జన్మిస్తాడని ఆయన పేర్కొన్నారు. దలైలామా కొత్తగా రాసిన పుస్తకంలో ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో దాదాపు ఆరు దశాబ్దాలుగా టిబెట్‌ నియంత్రణపై చైనాతో ఆయనకు వివాదం ఉన్న విషయం తెలిసిందే. తన తర్వాత దలైలామా వారసత్వం కొనసాగాలని ఆయన రాసిన వాయిస్‌ ఫర్‌ ది వాయిస్‌లెస్‌లో కోరారు. నేడు విడుదల కానున్న ఈ పుస్తకాన్ని ఓ ఆంగ్ల వార్తా సంస్థ సమీక్షించింది.

Advertisements
అక్కడే నావారసుడు జన్మిస్తాడు దలైలామా

గతంలో ఓ సందర్భంలో దలైలామా మాట్లాడుతూ తన తర్వాత ఈ పరంపర ముగిసిపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ, తాజా పుస్తకంలో మాత్రం చైనా బయట పుడతారని పేర్కొన్నారు. తన పునర్జన్మ టిబెట్‌ బయట జరగొచ్చని.. అది భారత్‌లో కూడా కావచ్చని ఆయన పేర్కొన్నారు. పూర్వీకుల పనిని ముందుకు తీసుకెళ్లటానికి ఉద్దేశించిందే పునర్‌జన్మ. కొత్త దలైలామా చైనా బయట స్వేచ్ఛా ప్రపంచంలో జన్మిస్తాడు. అందుకే తన బాధ్యత అయిన విశ్వకరుణకు గొంతుకగా ఉంటారు అని పేర్కొన్నారు.

అక్కడే నా వారసుడు జన్మిస్తాడు దలైలామా

14వ దలైలామాగా మారిన టెంజియన్‌ గ్యాట్సో 23వ ఏటే టిబెట్‌ నుంచి భారత్‌కు వలసవచ్చారు. నాడు తమ ప్రాంతాన్ని ఆక్రమించిన చైనాకు వ్యతిరేకంగా ఆయన గళం విప్పారు. టిబెట్‌ వాదాన్ని సజీవంగా ఉంచినందుకు ఆయనకు 1989లో నోబెల్‌ శాంతి బహుమతి వచ్చింది. తన వారసుడిగా చైనా ప్రకటించే వ్యక్తికి ఎటువంటి గౌరవం లభించదని వెల్లడించారు.

దలైలామా ప్రస్తుతం భారత్‌లోని ధర్మశాలలో ఆశ్రయం పొందుతున్నారు. ఆయన అక్కడి నుంచే తన వారసుడిని ఎంపిక చేయనున్నారు. ఇది చైనాకు గిట్టక తన గడ్డపైనే వారసుడిని గుర్తించాలంటోంది. టిబెటన్‌ బౌద్ధుల దృష్టిలో దలైలామా తరవాత రెండో స్థానం పాంచెన్‌ లామాది. ఈ పదవికి దలైలామా ఎంపిక చేసిన బాలుడిని కాదని చైనా తనే ఒక బాలుడిని నియమించినా, టిబెటన్ల ఆమోదం పొందడంలో అతడు విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త వారసుడి ఎంపికపై ఆసక్తి నెలకొంది.

Related Posts
Pakistan : పాక్ ఉగ్ర వ్యూహానికి రూ.10 వేల కోట్లు ఖర్చు
Pakistan : పాక్ ఉగ్ర వ్యూహానికి రూ.10 వేల కోట్లు ఖర్చు

పాకిస్తాన్ ఉగ్రవాదానికి గట్టి ఆధారంగా మారిందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లోని పెహల్గాం బైసరీన్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన Read more

Telangana: బీజేపీ ఎమ్మెల్యేల అరెస్ట్.. వర్సిటీ వద్ద భారీగా పోలీసులు !
బీజేపీ ఎమ్మెల్యేల అరెస్ట్.. వర్సిటీ వద్ద భారీగా పోలీసులు !

Telangana: హెచ్సీయూ భూములను పరిశీలించేందుకు బీజేపీ నేతలు బయల్దేరారు. భూముల వద్ద వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్లేందుకు యత్నించారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందు భారీగా Read more

షేక్ హసీనా వీసాను పొడిగించిన భారత్
షేక్ హసీనా వీసాను పొడిగించిన భారత్

బంగ్లాదేశ్ నుండి పెరుగుతున్న డిమాండ్ల నేపథ్యంలో షేక్ హసీనాను అప్పగించాలని వచ్చిన అంశం పై ఈ చర్య తీసుకోబడింది. అయితే, హసీనాకు ఆశ్రయం ఇచ్చారు అన్న వాదనలను Read more

జూన్ తర్వాత తెలంగాణ సీఎం మారబోతున్నారు – మహేశ్వర్ రెడ్డి
bjp maheshwar reddy

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఎమ్మెల్సీ మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్ రెడ్డిని వచ్చే ఏడాది జూన్ నాటికి సీఎం పదవి Read more

Advertisements
×