Mubarak Gul sworn in as Protem Speaker of Jammu and Kashmir Assembly

జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ముబారక్‌ గుల్‌ ప్రమాణస్వీకారం

శ్రీనగర్‌: కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌లో సుదీర్ఘకాలం తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అక్కడ చివరగా బీజేపీ-పీడీపీ సంకీర్ణ సర్కారు కుప్పకూలడం, జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దుచేసి జమ్ముకశ్మీర్‌, లఢఖ్‌ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం, కేంద్రం తీరును నిరసిస్తూ ఆందోళనలు వెల్లువెత్తడం లాంటి పరిణామాల నేపథ్యంలో 2018 నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగింది.

ప్రస్తుతం పరిస్థితి చక్కబడటంతో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 90 స్థానాలకు గాను నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ 42 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్‌, ఆప్‌ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఒమర్‌ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు కొందరు మంత్రులుగా బాధ్యతలు తీసుకున్నారు. త్వరలో అసెంబ్లీ కొలువుదీరనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రొటెం స్పీకర్‌ ప్రమాణస్వీకారం జరిగింది.

నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ సీనియర్‌ నేత ముబారక్ గుల్ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. శ్రీనగర్‌లోని రాజ్‌భవన్‌లో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. జమ్ముకశ్మీర్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా.. ముబారక్‌ గుల్‌ చేత ప్రమాణస్వీకారం చేయించారు. కొత్తగా కొలువుదీరబోయే అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరి చేత ఆయన ప్రమాణస్వీకారాలు చేయించనున్నారు. ఆ స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ల ఎన్నిక జరగనుంది. ఇదిలావుంటే ఒమర్ అబ్దుల్లా క్యాబినెట్‌ ఇటీవల సమావేశమై జమ్ముకశ్మీర్‌కు రాష్ట్రహోదా కల్పించాలని తీర్మానం చేసింది.

Related Posts
ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం!
mlc elections telangana and

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగియనున్నాయి. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయిన తరువాత, విపక్షాల నుండి పోటీ లేకపోవడంతో అభ్యర్థుల గెలుపు దాదాపుగా ఖాయమైపోయింది. దీనివల్ల Read more

రైల్వే స్టేషన్ లో మహిళా ప్రయాణికురాలికి తప్పిన ప్రమాదం
రైల్వే స్టేషన్ లో మహిళా ప్రయాణికురాలికి తప్పిన ప్రమాదం

బోరివలి రైల్వే స్టేషన్‌లో ఓ మహిళా ప్రయాణికురాలికి తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. కదులుతున్న రైలు నుండి దిగే ప్రయత్నంలో, ఆమె అదుపు తప్పి పట్టాలపై పడబోయింది. Read more

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌..
Cabinet approves constitution of 8th Pay Commission

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరే శుభవార్త తెలిపింది. 8వ వేతన సంఘం ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది. ఈ మేరకు కేంద్రం మంత్రి Read more

మొదటి పెళ్లి రద్దుకాకున్నా.. రెండో భర్త భరణం ఇవ్వాల్సిందే.. సుప్రీంకోర్టు

ఈ మేరకు తెలంగాణకు చెందిన ఎన్‌.ఉషారాణి Vs మూడుదుల శ్రీనివాస్‌ కేసులో జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మల ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *