📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Vijay -Rashmika Wedding : రేపే రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి నిజమా ?

Author Icon By Sudheer
Updated: February 1, 2026 • 10:04 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాలీవుడ్ సెన్సేషనల్ పెయిర్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లిపై సోషల్ మీడియాలో మరోసారి వార్తలు గుప్పుమంటున్నాయి. వీరిద్దరూ రేపే (ఫిబ్రవరి 2న) వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రాజస్థాన్‌లోని చారిత్రాత్మక ఉదయ్‌పూర్ సిటీ ప్యాలెస్ వీరి వివాహ వేదిక కానుందని, అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇద్దరు యువతులు చేసిన వీడియో వైరల్ కావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే రూమర్స్ వస్తున్నప్పటికీ, తాజా పరిణామాలు అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.

HYD : హైదరాబాద్‌లో మరో కొత్త షాపింగ్ మాల్..ఇందులో విశేషాలు మాములుగా లేవు !!

గత ఏడాది చివరలోనే విజయ్, రష్మికలు అత్యంత సన్నిహితులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ వార్తలను వారు అధికారికంగా ధృవీకరించనప్పటికీ, రష్మిక ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ “సరైన సమయం వచ్చినప్పుడు నా వ్యక్తిగత విషయాల గురించి తప్పకుండా చెబుతాను” అని అర్థవంతమైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో జరుగుతున్న హడావుడి చూస్తుంటే, బాలీవుడ్ సెలబ్రిటీల తరహాలో వీరిద్దరూ కూడా అత్యంత రహస్యంగా, రాయల్ వెడ్డింగ్‌కు ప్లాన్ చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Vijay Deverakonda

‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలతో వెండితెరపై మ్యాజిక్ చేసిన ఈ జంట, నిజ జీవితంలోనూ ఒక్కటి కావాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అయితే, ఈ పెళ్లి వార్తలపై విజయ్ దేవరకొండ లేదా రష్మిక టీమ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సినిమా ప్రమోషన్స్ కోసం లేదా మరేదైనా యాడ్ షూట్ కోసం ఉదయ్‌పూర్‌లో ఏర్పాట్లు చేస్తున్నారా? లేక నిజంగానే ఏడడుగులు వేయబోతున్నారా? అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడక తప్పదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే మాత్రం, ఇది టాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్ వెడ్డింగ్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Google News in Telugu Latest News in Telugu Vijay -Rashmika Vijay -Rashmika Wedding date

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.