Vijay Jan Nayagan movie : తమిళ స్టార్ హీరో Vijay నటించిన జన నాయగన్ చిత్రం విడుదలపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. సినిమా విడుదల, సెన్సార్ సర్టిఫికెట్ అంశాలపై Madras High Court లో దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘ వాదనలు జరిగాయి. వాదనలు పూర్తయిన అనంతరం చీఫ్ జస్టిస్ మహీంద్రన్ మోహన్ శ్రీవాత్సవ, జస్టిస్ జి. అరుళ్ మురుగన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది.
ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ Central Board of Film Certification (CBFC) డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది.
Read Also: India vs New Zealand : ODI టాస్ భారత్‌దే, సిరీస్ ఎవరిది?
సీబీఎఫ్‌సీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ (Vijay Jan Nayagan movie) ఏఆర్‌ఎల్ సుందరేశన్ వాదనలు వినిపించారు. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి బోర్డుకు సరిపడ సమయం ఇవ్వలేదని, అలాగే సినిమాను రివిజన్ కమిటీకి పంపాలన్న నిర్ణయాన్ని నిర్మాతలు అప్పట్లో సవాల్ చేయలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
నిర్మాతల తరఫున సీనియర్ న్యాయవాది సతీశ్ పరాశరన్ వాదనలు వినిపిస్తూ—మొదట యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సీబీఎఫ్‌సీ, బోర్డులోని ఒక సభ్యుడి అభిప్రాయం ఆధారంగా ఆ నిర్ణయాన్ని మార్చిందని ఆరోపించారు. బోర్డు సూచనల మేరకు కొన్ని సన్నివేశాలను తొలగించినప్పటికీ, మళ్లీ అదే సన్నివేశాలను జోడించి తిరిగి తొలగించాలని కోరడం సమంజసం కాదని తెలిపారు. కావాలనే సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని కోర్టుకు విన్నవించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: