మోహన్ శ్రీవత్స (Mohan Srivatsa) దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’ (Tribanadhari Barbarik Movie) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ పాల్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో సీనియర్ నటుడు సత్యరాజ్, టీవీ యాంకర్‌గా అందరికీ పరిచయమైన ఉదయభాను, అలాగే ప్రతిభావంతుడైన నటుడు వశిష్ఠ సింహా (Vasishtha Simha) ప్రధాన పాత్రల్లో నటించారు.
Read Also: Ravi Teja: ఈగల్ సినిమా నా ఫేవరెట్
ఆగస్టు 29న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా. ముఖ్యంగా దర్శకుడు రిలీజ్‌కు ముందు విడుదల చేసిన ఒక ఆసక్తికరమైన వీడియో ఈ సినిమాపై మంచి హైప్ తెచ్చింది.ఈ నెల 10వ తేదీ నుంచి ఈ సినిమా ‘అమెజాన్ ప్రైమ్’ (amazon prime) లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ (Movie Review) లో తెలుసుకుందాం.
కథ
శ్యామ్ (సత్యరాజ్) ఓ మానసిక వైద్య నిపుణుడు. కొడుకు – కోడలు ఒక ప్రమాదంలో చనిపోవడంతో, మనవరాలు ‘నిధి’తో కలిసి హైదరాబాదు (Hyderabad) లో నివసిస్తూ ఉంటాడు. 14 ఏళ్ల ‘నిధి’ ఒక స్కూల్లో చదువుతూ ఉంటుంది. నిధికి ఒకసారి ఆయన ‘బార్బరిక్’ నాటకాన్ని చూపిస్తాడు. మూడు బాణాలతో బార్బరికుడు అనుసరించే విధానం ఆయనకి నచ్చుతుంది.
ఆ నాటకం నిధిపై కూడా ప్రభావాన్ని చూపుతుంది.హైదరాబాదులో వాకిలి పద్మ (ఉదయభాను) డాన్ గా వ్యవహరిస్తూ ఉంటుంది. దేవ్ ఆమెకి మేనల్లుడు. అతనికి తన కూతురు మహాలక్ష్మిని ఇచ్చి పెళ్లి చేయాలని పద్మ భావిస్తుంది. దేవ్ స్నేహితుడే రామ్ (వశిష్ఠ ఎన్ సింహా). అతను సత్య అనే యువతిని లవ్ చేస్తూ ఉంటాడు.
కథనం
లైఫ్ లో సెటిల్ కావడం కోసం అమెరికా వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అందుకు అవసరమైన డబ్బు కోసం, ఆలోచన చేస్తూ ఉంటాడు. తుపాను (storm) కారణంగా హైదరాబాదు లో వర్షం కురుస్తూ ఉంటుంది. చీకటి పడుతున్నా నిధి ఇంటికి రాకపోవడంతో, ఆమె తాత శ్యామ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తాడు. అతనితో కలిసి నిధిని వెతకడం కోసం కానిస్టేబుల్ చంద్ర (సత్యం రాజేశ్) బరిలోకి దిగుతాడు.
చివరిసారిగా నిధి ఓ కుర్రాడితో కనిపించిందని తెలుసుకుంటారు. ఆ కుర్రాడు ఎవరు? నిధి ఏమైపోతుంది? ఆమె క్షేమంగా తిరిగొస్తుందా? అనేది మిగతా కథ. “మనం బ్రతుకుతున్నది ఒక అరణ్యంలో. మృగాలు మన గుమ్మం ముందే పొంచి ఉంటాయి. మనం బలహీనంగా ఉంటే అవి లోపలికి వచ్చేస్తాయి” అనేది ఈ సినిమాలో కథానాయకుడు చెప్పే డైలాగ్.
ఒక్క మాటలో చెప్పాలంటే ఈ అంశం చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. అందరం కలిసి బ్రతుకుతున్నట్టుగా కనిపించినా, ఇక్కడ ఎవరి సమస్యకు వారే పరిష్కారాన్ని వెతుక్కోవాలి అనే అంశాన్ని గురించి చెబుతుంది.
త్రిబాణధారి బార్బరిక్ మూవీ ఎలా ఉందో మీ అభిప్రాయం తెలపండి?
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: