हिन्दी | Epaper

Kantara – Chapter 1 : ఏపీలో ‘కాంతార ఛాప్టర్-1’ టికెట్ రేట్ల పెంపు

Sudheer
Kantara – Chapter 1 : ఏపీలో ‘కాంతార ఛాప్టర్-1’ టికెట్ రేట్ల పెంపు

కన్నడ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కాంతార ఛాప్టర్-1’ (Kantara – Chapter 1)చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చింది. అక్టోబర్ 1న రాత్రి 10 గంటలకు ప్రీమియర్ షో నిర్వహించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి జీవో విడుదల చేసింది. సాధారణంగా సినిమాల ప్రీమియర్ షోలకు రాత్రి 9 తర్వాత అనుమతులు ఇవ్వడం అరుదుగా జరుగుతుంది. ఈ చిత్రానికి భారీ అంచనాలు ఉండటంతో, రిషబ్ శెట్టి అభిమానుల డిమాండ్ దృష్ట్యా ప్రభుత్వం ప్రత్యేక నిర్ణయం తీసుకుంది.

News telugu: Chiranjeevi-కుటుంబ సభ్యులతో కలిసి ఓజీ సినిమా చూసిన చిరంజీవి

ఏపీ ప్రభుత్వం (AP Govt) ‘కాంతార ఛాప్టర్-1’కు టికెట్ రేట్లు పెంచుకునేందుకు కూడా అవకాశం కల్పించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సాధారణ టికెట్ ధరకు అదనంగా Rs.75+GST, మల్టీప్లెక్స్‌లలో Rs.100+GST అదనంగా వసూలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ పెరిగిన రేట్లు అక్టోబర్ 11 వరకు అమల్లో ఉంటాయి. ఈ నిర్ణయంతో ప్రీమియర్ షో, తొలి వారంలో ప్రదర్శనలు మరింత భిన్నంగా, భారీ స్థాయిలో జరుగనున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌కు అభిమానుల నుండి విపరీతమైన స్పందన లభిస్తోంది.

ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ‘కాంతార’ మొదటి భాగం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో, రెండో భాగంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పాన్-ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ అవుతుండటంతో ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లోనూ అభిమానులు భారీ సంఖ్యలో థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది. ప్రీమియర్ అనుమతులు, టికెట్ రేట్ల పెంపు వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు ఆర్థికంగా ఊరట లభించనుంది. దీంతో ‘కాంతార ఛాప్టర్-1’ ఏపీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫిబ్రవరి 26న ఒక్కటవ్వబోతున్న విరోష్, రష్మిక

ఫిబ్రవరి 26న ఒక్కటవ్వబోతున్న విరోష్, రష్మిక

రిషభ్ శెట్టి హనుమంతుడిగా ‘జై హనుమాన్’ ఘన ప్రారంభం

రిషభ్ శెట్టి హనుమంతుడిగా ‘జై హనుమాన్’ ఘన ప్రారంభం

సాయిపల్లవి @ 7 ఫిల్మ్ ఫేర్స్

సాయిపల్లవి @ 7 ఫిల్మ్ ఫేర్స్

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్.. బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్.. బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్

శ్రీలీలకు బంపర్ ఆఫర్

శ్రీలీలకు బంపర్ ఆఫర్

విష్వక్సేన్ ‘కల్ట్’ టీజర్ వైరల్, వయొలెన్స్‌తో షాక్ ఇచ్చింది

విష్వక్సేన్ ‘కల్ట్’ టీజర్ వైరల్, వయొలెన్స్‌తో షాక్ ఇచ్చింది

స్టేజీపై వరలక్ష్మీ శరత్ కుమార్ కన్నీళ్లు

స్టేజీపై వరలక్ష్మీ శరత్ కుమార్ కన్నీళ్లు

డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ డైలాగ్స్ పై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ డైలాగ్స్ పై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

అల్లు అర్జున్ ‘సంధ్య థియేటర్ తొక్కిసలాట’ కేసులో కీలక పరిమాణం

అల్లు అర్జున్ ‘సంధ్య థియేటర్ తొక్కిసలాట’ కేసులో కీలక పరిమాణం

యష్ టాక్సిక్ టీజర్ విడుదల
1:52

యష్ టాక్సిక్ టీజర్ విడుదల

జైలు నుండి బయటకు వచ్చాక ఐ బొమ్మ రవి నుండి వచ్చిన మాట అదే !!

జైలు నుండి బయటకు వచ్చాక ఐ బొమ్మ రవి నుండి వచ్చిన మాట అదే !!

స్పెషల్ జ్యూరీ ఛైర్మన్ గా తమ్మారెడ్డి నియామకం

స్పెషల్ జ్యూరీ ఛైర్మన్ గా తమ్మారెడ్డి నియామకం

📢 For Advertisement Booking: 98481 12870