📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Tollywood : థియేటర్ల బంద్ కుట్ర వెనుక ఈ ముగ్గురే – నట్టికుమార్

Author Icon By Sudheer
Updated: May 25, 2025 • 7:41 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం హరిహర వీరమల్లు (harihara veeramallu) విడుదల విషయంలో చిత్ర పరిశ్రమలోని కొందరు ప్రముఖులు ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టించారని నిర్మాత, ఫిల్మ్ ఛాంబర్ సంయుక్త కార్యదర్శి నట్టి కుమార్ ఆరోపించారు. డిస్ట్రిబ్యూషన్ హక్కులను తక్కువ ధరకు దక్కించుకునేందుకు జూన్ 1 నుండి థియేటర్ల బంద్‌ను ప్రకటించడం రాజకీయ, వాణిజ్య ప్రయోజనాల కోసం పన్నిన కుట్ర అని ఆయన విమర్శించారు. ఈ కుట్ర వెనుక అల్లు అరవింద్, సురేశ్ బాబు, వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు.

థియేటర్ల బంద్ ఒక డ్రామా మాత్రమే: నట్టి ఆరోపణ

నట్టి కుమార్ (Nattikumar) వెల్లడించిన వివరాల ప్రకారం, హరిహర వీరమల్లు ఇప్పటికే ఆలస్యం కావడంతో నిర్మాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో జూన్ 12న విడుదల కావాల్సిన సినిమాకు అడ్డుపడేందుకు, మే 18న అకస్మాత్తుగా బంద్‌ను ప్రకటించడం వెనక వ్యాపార స్వార్థమేనని తెలిపారు. అసలు మే 14న జరిగిన ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈసీ మీటింగ్‌లో బంద్ ప్రస్తావన కూడా రాలేదని, ఈ నిర్ణయం తగిన ప్రక్రియ లేకుండా తీసుకున్నారని ఆరోపించారు. థియేటర్లు తమ ఆధీనంలో ఉన్నాయని భావించి, డిస్ట్రిబ్యూషన్ హక్కులు తక్కువ ధరకే ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని అన్నారు.

మంత్రుల జోక్యంతో వెనక్కి

నట్టి కుమార్ ప్రకారం, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ జోక్యం తర్వాత బంద్ ప్రకటనను వెనక్కి తీసుకోవడం ద్వారా వారి కుట్ర బహిర్గతమైందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని 1400 థియేటర్లలో 1300కి పైగా ఒకే వర్గం ఆధీనంలో ఉండటం చిత్ర పరిశ్రమలో సమతుల్యత లేకపోవడానికి నిదర్శనమని అన్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వంటి సంస్థలు ఎదగడాన్ని జీర్ణించుకోలేని వ్యక్తులే ఈ వ్యవహారాన్ని ప్రణాళికబద్ధంగా అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. కుబేర వంటి ఇతర పెద్ద సినిమాలు విడుదలయ్యే సమయాన్ని లక్ష్యంగా చేసుకుని బంద్ పిలవడం ద్వారా వారి అసలు ఉద్దేశాలు బయటపడుతున్నాయని నట్టి కుమార్ వ్యాఖ్యానించారు.

Read Also : Sahadev Singh Gohil : గుజరాత్‌లో ఆరోగ్య కార్యకర్త అరెస్ట్!

Google News in Telugu nattikumar theatres bandh tollywood

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.