📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Prabhas The Raja Saab : ది రాజా సాబ్ USA బాక్సాఫీస్ షాక్ ప్రభాస్ అడ్వాన్స్ బుకింగ్స్

Author Icon By Sai Kiran
Updated: December 29, 2025 • 8:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Prabhas The Raja Saab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న హారర్ కామెడీ చిత్రం ది రాజా సాబ్ అమెరికా బాక్సాఫీస్ అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ఆశించిన స్థాయిలో రాణించడం లేదనే చర్చ మొదలైంది. సినిమా విడుదలకు ఇంకా 12 రోజులు మాత్రమే ఉండగా, ఉత్తర అమెరికా మార్కెట్‌లో ప్రీ-సేల్స్ మందగించినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

బాహుబలి విడుదల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్‌కు భారీ మార్కెట్ ఏర్పడింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన నిమిషాల్లోనే రికార్డులు బద్దలవడం అభిమానులు అలవాటు పడిన విషయం. కానీ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ హారర్ కామెడీ విషయంలో ఆ ట్రెండ్ కనిపించడం లేదని విశ్లేషకులు అంటున్నారు.

Read Also:  SIR: ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు?

ఇప్పటివరకు అమెరికాలో ఈ సినిమా సుమారు 1.90 లక్షల డాలర్ల గ్రాస్ మాత్రమే సాధించగా, దాదాపు 6,600 టికెట్లు అమ్ముడయ్యాయి. (Prabhas The Raja Saab) ప్రభాస్ స్థాయిలో ఉన్న స్టార్‌కు ఇది ఆశాజనక సంఖ్య కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల బాహుబలి రీ-రిలీజ్‌తో మళ్లీ బాక్సాఫీస్ హంగామా సృష్టించిన ప్రభాస్‌కు, ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం నిరాశ కలిగిస్తున్నాయి.

అయితే, ప్రమోషన్లు పెరగడం, ట్రైలర్ లేదా పాటల ప్రభావంతో విడుదలకు దగ్గరగా పరిస్థితి మారవచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. హారర్ కామెడీ జానర్ కావడం వల్ల ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తుందా లేదా అనేది విడుదల తర్వాతే తేలనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Maruthi Prabhas film Prabhas Prabhas Horror Comedy Film Prabhas overseas collections Prabhas upcoming movie Prabhas USA advance bookings Telugu News The Raja Saab The Raja Saab advance sales USA The Raja Saab box office report The Raja Saab pre sales The Raja Saab USA Box Office Tollywood box office news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.