📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

Raja Saab new scenes : రాజాసాబ్‌లో కొత్త సీన్స్ ఏంటి? ప్రభాస్ ఓల్డ్ లుక్ థియేటర్లలో!

Author Icon By Sai Kiran
Updated: January 10, 2026 • 4:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Raja Saab new scenes : రెబల్ స్టార్ Prabhas అభిమానులకు శుభవార్త. ఆయన నటించిన తాజా చిత్రం The Raja Saab థియేటర్లలో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.112 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సందర్భంగా చిత్రబృందం బ్లాక్‌బస్టర్ మీట్‌ను నిర్వహించగా, దర్శకుడు Maruthi కీలక విషయాలు వెల్లడించారు.

అభిమానుల ఆనందాన్ని మరింత పెంచేలా సినిమాలో కొత్తగా ఎనిమిది నిమిషాల సన్నివేశాలను జోడిస్తున్నామని మారుతి తెలిపారు. ముఖ్యంగా చాలా మంది ఎదురుచూస్తున్న ప్రభాస్ ఓల్డ్ గెటప్ సీన్స్ ఈ కొత్త భాగాల్లో ఉంటాయని చెప్పారు. టీజర్, పోస్టర్లలో కనిపించిన ఆ లుక్ సినిమా విడుదల సమయంలో లేకపోవడంతో కొంతమంది అభిమానులు నిరాశ వ్యక్తం చేశారని, వారి కోసమే ఈ సీన్స్‌ను యాడ్ చేస్తున్నామని వివరించారు. ఈ కొత్త సన్నివేశాలకు సెన్సార్ పూర్తయిందని, ఈరోజు సాయంత్రం నుంచే థియేటర్లలో వీటిని చూడవచ్చని తెలిపారు.

మారుతి మాట్లాడుతూ, తెలంగాణలో ముఖ్యంగా (Raja Saab new scenes) హైదరాబాద్‌లో షో టైమింగ్స్ సరిగా పడక ప్రేక్షకులకు ఇబ్బంది కలిగిందని, అందుకు క్షమాపణలు చెప్పారు. ప్రభాస్ తనపై పెట్టిన నమ్మకానికి తాను ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. తాను మిడ్ రేంజ్ దర్శకుడినైనా ప్రభాస్ లాంటి స్టార్ తనతో సినిమా చేయడం గర్వకారణమని చెప్పారు. అభిమానులు ప్రభాస్‌ను ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించేందుకు ప్రయత్నించానని అన్నారు.

Vijay: ‘జన నాయగన్ ‘ సినిమా విడుదల రోజే అసలైన పండుగ: జై

సినిమా క్లైమాక్స్ భాగం మైండ్ గేమ్‌లా ఉంటుందని, ముఖ్యంగా చివరి 40 నిమిషాలు చాలా మందికి బాగా నచ్చాయని చెప్పారు. ఇలాంటి నేపథ్యంతో ఇప్పటివరకు భారతీయ తెరపై సినిమా రాలేదని కొందరు ప్రశంసిస్తున్నారని తెలిపారు. ప్రభాస్ సాధారణ కమర్షియల్ సినిమా చేయవచ్చని, కానీ కొత్త కథలు, కొత్త ప్రయత్నాలకు ప్రోత్సాహం ఇవ్వాలనే ఆలోచనతో ఈ సినిమా చేశారని చెప్పారు.

సినిమా ఫలితాన్ని ఒక్క రోజు లేదా ఒక్క షోతోనే నిర్ణయించవద్దని మారుతి విజ్ఞప్తి చేశారు. కనీసం పది రోజులు వేచి చూస్తే సినిమా స్థాయి తెలుస్తుందని అన్నారు. కొన్ని కొత్త అంశాలను అర్థం చేసుకోవడానికి ప్రేక్షకులకు కొంత సమయం పడుతుందని, తొందరపడి విమర్శలు చేయొద్దని కోరారు.

సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలు విజయవంతం కావాలని తాను కోరుకుంటున్నానని మారుతి తెలిపారు. సినిమా ఫలితం గురించి తాను బాధపడుతున్నానని అనుకుని చాలామంది ఫోన్ చేశారని, కానీ తాను పూర్తిగా హ్యాపీగా ఉన్నానన్నారు. అభిమానుల కోసం ముందుగానే ప్రభాస్ ఓల్డ్ గెటప్‌ను థియేటర్లకు తీసుకొస్తున్నామని చెప్పారు. సోమవారం నుంచి సాధారణ టికెట్ ధరలు అమల్లోకి వస్తాయని కూడా వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Maruthi director statement Prabhas latest movie update Prabhas old look Raja Saab Raja Saab additional scenes Raja Saab box office news Raja Saab fan update Sankranti Prabhas film Telugu movie theatre update Telugu News The Raja Saab new scenes

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.