📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

The Kerala Story 2 : ‘ది కేరళ స్టోరీ-2’కి షాకింగ్ కలెక్షన్లు

Author Icon By Sudheer
Updated: February 28, 2026 • 9:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

2023లో సంచలనం సృష్టించి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘ది కేరళ స్టోరీ’కి కొనసాగింపుగా వచ్చిన ‘ది కేరళ స్టోరీ-2’కు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఆదరణ కరవైంది. సుమారు రూ. 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, మొదటి రోజు కేవలం రూ. 3.5 కోట్ల వసూళ్లను మాత్రమే సాధించింది. ముఖ్యంగా సినిమా కథాంశానికి నిలయమైన కేరళ రాష్ట్రంలో థియేటర్లు వెలవెలబోతున్నాయి. బుక్ మై షో గణాంకాల ప్రకారం, తిరువనంతపురంలోని ప్రముఖ థియేటర్ PVRలో నాలుగు షోలకు కలిపి కేవలం 68 టిక్కెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ గణాంకాలు సినిమా ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆదరణ లోపాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

Iran Defense Minister: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి మృతి?

తొలి భాగం నుండి ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న DYFI కార్యకర్తలు, థియేటర్ల ముందు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. సినిమా విడుదలను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా పలుచోట్ల ఆందోళనలు జరిగాయి. 2023లో వచ్చిన మొదటి భాగం భారీ వివాదాల మధ్య విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధించింది, కానీ ఈసారి సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. ప్రేక్షకుల నుండి మరియు వివిధ వర్గాల నుండి వస్తున్న వ్యతిరేకత, బాక్సాఫీస్ ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

The Kerala Story 2

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.