📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Arnold Schwarzenegger : ఆర్నాల్డ్ లేకుండానే టెర్మినేటర్?.. అభిమానులకు షాక్ న్యూస్!…

Author Icon By Sai Kiran
Updated: December 19, 2025 • 10:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Arnold Schwarzenegger : హాలీవుడ్ యాక్షన్–సైన్స్ ఫిక్షన్ ఫ్రాంచైజీ ‘టెర్మినేటర్’ అభిమానులకు దర్శకుడు జేమ్స్ కామెరాన్ షాకింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సిరీస్‌లో రాబోయే తదుపరి చిత్రంలో ఐకానిక్ హీరో ఆర్నాల్డ్ ష్క్వార్జ్‌నెగ్గర్ కనిపించబోరని ఆయన స్పష్టం చేశారు. ఇకపై కొత్త తరం పాత్రలతో ఈ కథను ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం వచ్చిందని కామెరాన్ అభిప్రాయపడ్డారు.

హాలీవుడ్ రిపోర్టర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెరాన్ మాట్లాడుతూ, “‘టెర్మినేటర్: డార్క్ ఫేట్’ చిత్రంతో T-800 పాత్రకు గొప్ప ముగింపు ఇచ్చాం. ఆర్నాల్డ్ పాత్రను మరింత కొనసాగించాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను. ఇకపై కొత్త పాత్రలు, కొత్త ఆలోచనలతో కథను విస్తరించాలనుకుంటున్నాను” అని తెలిపారు.

Read Also: AP Weather: ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు

1984లో విడుదలైన మొదటి ‘టెర్మినేటర్’ నుంచి ఆర్నాల్డ్ ష్క్వార్జ్‌నెగ్గర్ ఈ ఫ్రాంచైజీకి ప్రతీకగా నిలిచారు. అయితే కాలిఫోర్నియా గవర్నర్‌గా (Arnold Schwarzenegger) ఉన్న సమయంలో 2009లో వచ్చిన ‘టెర్మినేటర్: సాల్వేషన్’ చిత్రంలో ఆయన నటించలేదు. ఇప్పుడు మరోసారి ఆయన లేకుండానే ఈ సిరీస్ కొనసాగనుంది.

ప్రస్తుతం తాను ‘అవతార్’ సిరీస్ పనుల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నానని, ఆ సినిమాలు పూర్తయ్యాక ‘టెర్మినేటర్’ స్క్రిప్ట్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెడతానని కామెరాన్ వెల్లడించారు. ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ చిత్రం డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Arnold Schwarzenegger avatar fire and ash Breaking News in Telugu Google News in Telugu Hollywood movie updates Hollywood sci fi news James Cameron interview James Cameron Terminator Latest News in Telugu sci fi action films T-800 character end Telugu News Terminator Dark Fate Terminator franchise update Terminator next movie Terminator without Arnold

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.