📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

71st National Film Awards 2025: నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో దుమ్ములేపిన తెలుగు చిత్రాలు

Author Icon By Sudheer
Updated: August 1, 2025 • 8:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ ఏడాది ప్రకటించిన 71వ జాతీయ చలనచిత్ర పురస్కాల్లో (71st National Film Awards 2025) తెలుగు చిత్రసీమకు ఘనమైన గుర్తింపులు లభించాయి. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ నటించిన “భగవంత్ కేసరి” ఉత్తమ తెలుగు ఫీచర్ చిత్రంగా ఎంపిక కావడం తెలుగు ప్రేక్షకులకు గర్వకారణంగా నిలిచింది. అనిల్ రవిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సాంఘిక అంశాలతో కూడిన బలమైన కథను ప్రేక్షకుల ముందు ఉంచింది. అలాగే హనుమాన్ సినిమాకు ఉత్తమ యాక్షన్ డైరెక్షన్, స్టంట్ కోరియోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో జాతీయ అవార్డులు లభించడం విశేషం.

తెలుగు పాటలు, రచయితలకు ప్రత్యేక గుర్తింపు

తెలుగు చలనచిత్ర గీత రచనకు ఈ సంవత్సరం ప్రత్యేక గుర్తింపు లభించింది. “బలగం” సినిమాలోని “ఊరు పల్లెటూరు” అనే పాటకు గీత రచయిత కాసర్ల శ్యామ్ జాతీయ అవార్డును అందుకున్నారు. అలాగే “బేబీ” సినిమాకు ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు (సాయి రాజేష్ నీలం) లభించింది. ఈ చిత్రంలోని గాయకుడు పివి ఎన్ఎస్ రోహిత్ ఉత్తమ మేల్ ప్లేబ్యాక్ సింగర్‌గా నిలవడం మరో గర్వకారణం. బాలనటిగా సుకృతి వేణి (దర్శకుడు సుకుమార్ కుమార్తె) “గాంధీ తాత చెట్టు” చిత్రంతో జాతీయ గుర్తింపు పొందింది.

ఇతర భాషల సినిమాలకు లభించిన అవార్డులు

తమిళంలో “పార్కింగ్”, బెంగాలీలో “డీప్ ఫ్రిడ్జ్”, హిందీలో “కథల్”, కన్నడలో “కందీలు” వంటి చిత్రాలు తమ భాషా విభాగాల్లో ఉత్తమ చిత్రాలుగా ఎంపికయ్యాయి. ఉత్తమ నటుడిగా షారుక్ ఖాన్ (జవాన్) , విక్రాంత్ మెస్సీ (12th ఫెయిల్) , ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ (Mrs ఛటర్జీ వర్సెస్ నార్వే) ఎంపిక కావడం బాలీవుడ్ అభిమానులకు సంతోషకర విషయం. ఉత్తమ సంగీత దర్శకులుగా జీవీ ప్రకాష్ కుమార్ (వాతి) , హర్షవర్ధన్ రామేశ్వర్ (యానిమల్) లను పురస్కరించారు.

నాన్-ఫీచర్ విభాగాల్లో ప్రత్యేక గుర్తింపులు

నాన్-ఫీచర్ విభాగంలో ఉత్తమ డాక్యుమెంటరీగా “గాడ్ వల్చర్ అండ్ హ్యూమన్” (ఇంగ్లీష్, హిందీ, తెలుగు) ఎంపికైంది. ఉత్తమ నరేషన్, దర్శకత్వం, స్క్రిప్ట్ విభాగాల్లోనూ పలు సినిమాలు అవార్డులు పొందాయి. మలయాళ చిత్రం “నేకల్ – క్రానికల్ ఆఫ్ ది ప్యాడీ మాన్”, ఒడియా చిత్రం “ది సీ అండ్ సెవెన్ విలేజెస్” స్పెషల్ మెన్షన్ అందుకున్నాయి. మొత్తం మీద 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో తెలుగు చిత్రాలు దుమ్ము రేపి, భారతీయ చిత్రసీమలో తమ ప్రత్యేక స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాయి.

Read Also : Donald Trump : ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. భారత్ కంటే అమెరికాకే అధిక నష్టం

71st National Film Awards 71st National Film Awards 2025 Google News in Telugu National Film Awards 2025

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.