Tamannaah Bhatia : తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మిల్కీ బ్యూటీ Tamannaah Bhatia తాజాగా తన కెరీర్‌లో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది. దాదాపు పదిహేనేళ్లకు పైగా హీరోయిన్‌గా కొనసాగుతున్న తమన్నా, ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. అయితే, ఈ ప్రయాణంలో కొన్ని అసహజ పరిస్థితులను కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆమె తెలిపింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్నా, ఒక సినిమా షూటింగ్ సమయంలో తనను బోల్డ్ సీన్ చేయమని కోరారని వెల్లడించింది. ఆ సన్నివేశంలో ఇంటిమసీ ఎక్కువగా ఉండటంతో తాను అసౌకర్యంగా భావించి మర్యాదపూర్వకంగా నిరాకరించానని చెప్పింది. అయితే, ఈ విషయం సదరు సౌత్ స్టార్ హీరోకు నచ్చలేదని, సెట్‌లో అందరి ముందే తనపై అరిచి, హీరోయిన్‌ను మార్చేయాలని చెప్పి అవమానించాడని ఆమె పేర్కొంది.
Read also : Ahmedabad Flight Crash Case : ఫ్లైట్ క్రాష్ కేసు.. AAIBకి FIP లీగల్ నోటీసులు
ఆ సంఘటన తనను తీవ్రంగా బాధపెట్టిందని (Tamannaah Bhatia) తమన్నా వెల్లడించింది. అయితే కొంత సమయం తర్వాత ఆ హీరో తన వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పినట్లు తెలిపింది. అయినప్పటికీ, ఆ హీరో పేరు మాత్రం వెల్లడించకపోవడంతో సోషల్ మీడియాలో, అభిమానుల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. సినిమా పరిశ్రమలో నటీమణులు ఎదుర్కొనే ఒత్తిడిపై ఈ వ్యాఖ్యలు మరోసారి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: