📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్‌.. ఒకరి మృతి మెక్సికోలో భూకంపం ఈరోజు నుంచి తెలంగాణ టెట్ బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ రూ. 500 నోట్లు బంద్.. రూమర్స్‌పై కేంద్ర ప్రభుత్వం వివరణ సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ న్యూ ఇయర్ దాడి కుట్ర విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్‌.. ఒకరి మృతి మెక్సికోలో భూకంపం ఈరోజు నుంచి తెలంగాణ టెట్ బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ రూ. 500 నోట్లు బంద్.. రూమర్స్‌పై కేంద్ర ప్రభుత్వం వివరణ సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ న్యూ ఇయర్ దాడి కుట్ర విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం

భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న సుమన్

Author Icon By Sudheer
Updated: October 18, 2024 • 5:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని శుక్రవారం సినీ నటుడు సుమన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు సుమన్ను ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం సుమన్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలతో ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. గతంలో సుమన్ శ్రీరామరాజ్యం మూవీ లో శ్రీరాముడి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. చిత్రసీమలో సుమన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇక నిన్న గురువారం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. దర్శన అనంతరం సుమన్ కుటుంబ సభ్యులకు అర్చక పండితులు వేదాశీర్వచనం పలికారు.ఇక ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదాలను అందజేశారు.

ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట ఆలయాన్ని మాజీ సీఎం కేసీఆర్ మహాద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. పునర్నిర్మాణం ముందు ఈ ఆలయం ఎలా ఉండేదో నాకు తెలుసని, కేసీఆర్ ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఆలయాన్ని చాలా అందంగా అద్భుత శిల్పకళతో నిర్మింపచేశారని మెచ్చుకున్నారు.

ఎంతో మంది శిల్పులు పనిచేసి అద్భుత శిల్పాలను, గోపురాలను చెక్కారని, గుడిలోపలికి వెళ్తే ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్లినట్లు ఉందన్నారు. ఇంత అద్భుతమైన గుడిని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని, భవిష్యత్తులో యాదగిరిగుట్ట ఆలయం దేశ, విదేశాల్లో మరింత ఖ్యాతిని పొందుతుందని తెలిపారు.

Bhadrachalam suman

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.