📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

NTR – Prashanth Neel : ఎన్టీఆర్ సినిమాలో శ్రద్ధా కపూర్?

Author Icon By Sudheer
Updated: May 12, 2025 • 8:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘డ్రాగన్’ పై ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ కీలక పాత్రలో నటించనుందని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రత్యేకంగా సినిమా సెకండ్ హాఫ్ లో ఆమె పాత్రకి ప్రాధాన్యత ఉండనుందని సమాచారం.

గతంలో రుక్మిణీ వసంత్ పేరు ప్రచారం

ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తుందని ప్రచారం సాగుతోంది. తాజాగా శ్రద్ధా కపూర్‌ పేరు తెరపైకి రావడంతో సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండొచ్చన్న ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. శ్రద్ధా కపూర్ ఓ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ కోసం ఎంపిక అయినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయంపై అధికారికంగా మూవీ యూనిట్ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.

యాక్షన్ & ఎమోషనల్ డ్రామా

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా యాక్షన్, ఎమోషన్‌ల మేళవింపుతో సరికొత్త మేకోవర్‌లో ఎన్టీఆర్‌ను చూపించనుందని టాక్. ఇప్పటికే చిత్రీకరణకు సంబంధించిన పలు షెడ్యూల్లు పూర్తయ్యాయి. స్టార్ క్యాస్టింగ్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా మూవీ టీమ్ అధికారిక సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు.

Read Also : Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి

dragon Google News in Telugu NTR ntr-prashanth neel’s dragon shraddha kapoor ntr

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.