బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి నివాసం వద్ద చోటుచేసుకున్న కాల్పుల ఘటన ముంబైలో తీవ్ర కలకలం సృష్టించింది. నిన్న అర్ధరాత్రి సుమారు 12:40 గంటల సమయంలో ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న ఆయన ఇంటిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. బైక్‌పై వచ్చిన దుండగుడు రోహిత్ శెట్టి ఇంటిని లక్ష్యంగా చేసుకుని దాదాపు 6 నుంచి 4 రౌండ్ల వరకు ఫైరింగ్ చేసినట్లు సమాచారం. కాల్పుల అనంతరం నిందితులు అక్కడి నుంచి వేగంగా పరారయ్యారు. నిశ్శబ్దంగా ఉన్న జుహు ప్రాంతం ఈ తూటాల శబ్దంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
HYD : హైదరాబాద్‌లో మరో కొత్త షాపింగ్ మాల్..ఇందులో విశేషాలు మాములుగా లేవు !!
ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న ముంబై పోలీసులు మరియు ఫోరెన్సిక్ నిపుణులు రోహిత్ శెట్టి నివాసానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో పడి ఉన్న తూటా వెల్లలను (Shells) సేకరించి, దర్యాప్తు ప్రారంభించారు. ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బైక్ నంబర్ మరియు నిందితుల ఆనవాళ్లను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఇది కేవలం భయపెట్టడానికి చేసిన ప్రయత్నమా లేక ప్రాణహాని తలపెట్టే ఉద్దేశంతో చేశారా అనే కోణంలో విచారణ సాగుతోంది.
‘సింగం’, ‘గోల్మాల్’ సిరీస్, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, ‘సింబా’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో మాస్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న రోహిత్ శెట్టిపై ఇలాంటి దాడి జరగడం బాలీవుడ్ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. గతంలోనూ పలువురు బాలీవుడ్ ప్రముఖులకు గ్యాంగ్‌స్టర్ల నుంచి బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో, ఈ కాల్పుల వెనుక ఏదైనా అండర్ వరల్డ్ గ్యాంగ్ ప్రమేయం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రోహిత్ శెట్టి ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com