Sharwanand Tirumala : ప్రముఖ టాలీవుడ్ హీరో శర్వానంద్, హీరోయిన్ సాక్షి వైద్య కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో వీరు స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న చిత్రబృందానికి టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.
శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు శర్వానంద్, సాక్షి వైద్యలకు వేదాశీర్వచనాలు అందించారు. అనంతరం టీటీడీ అధికారుల చేతుల మీదుగా స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
Read also : Ahmedabad Flight Crash Case : ఫ్లైట్ క్రాష్ కేసు.. AAIBకి FIP లీగల్ నోటీసులు
ఈ సందర్భంగా శర్వానంద్ మీడియాతో మాట్లాడుతూ, తాము కలిసి నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో ఘన విజయం (Sharwanand Tirumala) సాధించిందని తెలిపారు. సినిమా సక్సెస్ కావడంతో మొక్కులు చెల్లించుకునేందుకు తిరుమలకు వచ్చినట్లు చెప్పారు. ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా మంచి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని శ్రీవారి ఆశీస్సులు కోరుకున్నట్లు వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: