తమిళ సినీ పరిశ్రమలో మరో స్టార్ వారసుడు ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్ తనయుడు(Shankar Son ) అర్జిత్ శంకర్ హీరోగా రాబోతున్నారని సమాచారం. ప్యాషన్ స్టూడియోస్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుందని, అశోక్ అనే కొత్త దర్శకుడు దీనికి దర్శకత్వం వహించనున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్‌గా ఈ మూవీ రూపుదిద్దుకోబోతోందని, ప్రాజెక్ట్‌పై ఇప్పటికే మంచి బజ్ నెలకొన్నట్లు తెలుస్తోంది.
అర్జిత్ శంకర్ (Arjith Shankar ) సినీ పరిశ్రమలో కొత్తవాడు కాదు. గత కొన్నేళ్లుగా ప్రముఖ దర్శకుడు ఏఆర్. మురుగదాస్ వద్ద అసిస్టెంట్ డైరెక్టరుగా పనిచేస్తూ ఫిల్మ్ మేకింగ్‌లో అనుభవం సొంతం చేసుకున్నారు. ఈ అనుభవమే ఆయనను కెమెరా ముందు నిలబెట్టేలా స్ఫూర్తినిచ్చిందని అంటున్నారు. తండ్రి శంకర్ లాంటి గొప్ప దర్శకుడు ఉన్నప్పటికీ, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే తపనతో అర్జిత్ నటన వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
ఇక ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే తమిళ సినీ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. శంకర్ తనయుడిగా అర్జిత్‌పై సహజంగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్యాషన్ స్టూడియోస్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్ ఈ సినిమాను నిర్మించడం, కొత్త దర్శకుడు అశోక్‌తో కొత్త తరహా యూత్‌ఫుల్ కథను తెరపైకి తీసుకురావడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అర్జిత్ నటుడిగా ఎలా ఆకట్టుకుంటారో, ఆయన తొలి చిత్రం ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలని సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.