Sai Pallavi Hindi debut : ప్రముఖ నటి Sai Pallavi తొలి హిందీ సినిమా ‘ఏక్ దిన్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన రోజే వివాదంలో చిక్కుకుంది. గురువారం విడుదలైన ఈ పోస్టర్‌పై సోషల్ మీడియాలో కాపీ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ సినిమాలో Junaid Khan హీరోగా నటిస్తున్నారు.
నెటిజన్ల ఆరోపణల ప్రకారం, ఈ సినిమా పోస్టర్ ఒక ఒరిజినల్ థాయ్ సినిమా పోస్టర్‌ను యథాతథంగా అనుకరించినట్టుగా ఉందని అంటున్నారు. అంతేకాదు, హిందీ టైటిల్ ‘ఏక్ దిన్’ కూడా అసలు థాయ్ సినిమా టైటిల్‌కు నేరుగా అనువాదమేనని విమర్శలు చేస్తున్నారు. రెడిట్, ఎక్స్ (ట్విట్టర్) వంటి సోషల్ మీడియా వేదికల్లో ఈ అంశంపై చర్చ హోరెత్తుతోంది.
Read also : Balagam Venu : ఈసారి ఆ ‘సెంటిమెంట్’ను నమ్ముకున్నాడా ?
“ఒరిజినల్ సినిమా పోస్టర్‌ను మార్చకుండా వాడేశారు. కనీసం టైటిల్‌లో అయినా కొత్తదనం చూపించాల్సింది” అంటూ పలువురు యూజర్లు (Sai Pallavi Hindi debut) అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది అధికారిక రీమేక్ అయితే పోస్టర్‌లో కొంత పోలిక ఉండటం సహజమేనని అభిప్రాయపడుతున్నారు.
ఈ రొమాంటిక్ డ్రామాకు సునీల్ పాండే దర్శకత్వం వహిస్తుండగా, Aamir Khan Productions నిర్మిస్తోంది. మే 1న సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. అయితే ఫస్ట్ లుక్‌తోనే కాపీ ఆరోపణలు రావడంతో సినిమాపై నెగెటివ్ చర్చ మొదలైంది. ఈ వివాదంపై ఇప్పటివరకు చిత్ర దర్శక నిర్మాతలు అధికారికంగా స్పందించలేదు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: