RGV Post: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ మూవీ నుంచి ఇటీవల విడుదలైన ‘చికిరి.. చికిరి’ సాంగ్ సోషల్ మీడియాలో భారీ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ పాటకు 50 మిలియన్ పైగా వ్యూస్ రావడం విశేషం.
నెట్టింట మొత్తం ఈ సాంగ్‌కు సంబంధించిన రీల్స్, షార్ట్ వీడియోలు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా చికిరి సిగ్నేచర్ స్టెప్‌ను ఫ్యాన్స్ రీక్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్ సృష్టిస్తున్నారు.
Read Also: Andesri Funeral: అందెశ్రీకి కన్నీటి నివాళి.. పాడె మోసిన సీఎం
ఈ పాటలో ఏఆర్.రెహ్మాన్ అందించిన సంగీతం, జానీ కొరియోగ్రఫీ అద్భుతంగా ఉండగా, రామ్ చరణ్ యొక్క గ్రేస్‌ఫుల్ డ్యాన్స్ మూవ్స్ అభిమానుల్లో ఎనర్జీని నింపాయి.
ఇక తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) కూడా ఈ పాటపై స్పందించారు. ఎక్స్ (Twitter)లో పోస్ట్ చేస్తూ, “హీరోను ఎలివేట్ చేయడంలో సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, డైరెక్షన్ టీమ్స్ అద్భుతంగా పని చేశాయి. ‘పెద్ది’లోని ‘చికిరి’ పాటలో రామ్ చరణ్ ఎనర్జీ అద్భుతం” అంటూ ప్రశంసలు కురిపించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: