తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు మాస్ మహారాజా రవితేజ (Raviteja)కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రవితేజ తండ్రి భూపతి రాజు రాజగోపాల్ గారు (వయసు 90) గత రాత్రి తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, హైదరాబాదులోని రవితేజ నివాసంలో మరణించారు. ఈ వార్తతో అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు.
వృత్తిరీత్యా ఫార్మసిస్ట్‌గా సేవలు
భూపతి రాజు రాజగోపాల్ (Bhupathiraju Rajagopal) గారు తన వృత్తి జీవితంలో ఫార్మసిస్ట్‌గా పని చేశారు. ప్రజలకు సేవ చేయడమే తన ధ్యేయంగా పని చేసిన ఆయన ఎంతో శ్రద్ధగా, నిబద్ధతతో తన వృత్తిని నిర్వహించారు. కుటుంబానికి ఆర్థికంగా బలమిస్తూ తన కుమారులకు మంచి విలువలు, విద్య అందించారు. ఆయన శ్రమతోనే రవితేజ సినీ రంగంలో స్థిరపడగలిగారు.
అభిమానుల సంతాపం
రాజగోపాల్ ముగ్గురు కుమారులు. రవితేజ, రఘు, మరియు భరత్ రాజు. ఈ ముగ్గురిలో రవితేజ ఇప్పటికే సినిమా రంగంలో ప్రముఖుడిగా వెలుగొందుతున్నారు. భరత్ రాజు దురదృష్టవశాత్తు కొన్నేళ్ల క్రితం రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. ఇప్పుడు తండ్రి మరణం రవితేజ కుటుంబాన్ని మరింత శోకసంద్రంలోకి నెట్టింది. అభిమానులు, ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : YCP : ప్రసన్నకుమార్ రెడ్డిపై ఏపీ హైకోర్టు ఆగ్రహం