వైరల్ అవుతున్న రష్మిక పోస్ట్

Read Time:  1 min
rashmika post
rashmika post
FONT SIZE
GET APP

రష్మిక మందన్నా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటి. అయితే, ఇటీవల ఆమె పెట్టిన ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో “దయ ” చూపించండి అంటూ ఓ మెసేజ్ షేర్ చేయగా, ఇది నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. “ఈరోజుల్లో దయ తగ్గిపోతోంది, అందరూ ఒకరిపై ఒకరు దయతో ఉండాలి” అని చెప్పిన ఆమె, తన ధరించిన టీషర్ట్‌పై కూడా ‘Kindful’ అనే పదం ఉంది. దీంతో ఆమె పోస్ట్ వెనుకున్న అర్థం గురించి అభిమానులు, నెటిజన్లు చర్చించుకోవడం మొదలుపెట్టారు.

ఇటీవల రష్మిక, విజయ్ దేవరకొండ కలిసి జిమ్‌కు వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. జిమ్ నుండి బయటకు వచ్చిన సమయంలో రష్మిక కాలికి గాయమై ఇబ్బంది పడుతూ కారు ఎక్కగా, విజయ్ దేవరకొండ మాత్రం సహాయం చేయకుండా కారు లోపల కూర్చోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు విజయ్ పై తీవ్ర విమర్శలు చేశారు. అయితే, విజయ్‌ను ట్రోల్ చేస్తున్న వారికి సమాధానం ఇచ్చేలా రష్మిక “దయగా ఉండండి” అంటూ ఈ పోస్ట్ పెట్టిందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

rashmika vijay
rashmika vijay

ప్రస్తుతం రష్మిక మందన్నా వరుస సినిమాలతో కెరీర్‌లో దూసుకుపోతుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటించి భారీ విజయాన్ని అందుకుంది. బాలీవుడ్‌లో కూడా మంచి అవకాశాలను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. ఆమె ప్రస్తుతం ‘ఛావా’ అనే హిస్టారికల్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతుండగా, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.