हिन्दी | Epaper
విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill

రష్మిక సరికొత్త పాత్రలో నటించనుంది.

Divya Vani M
రష్మిక సరికొత్త పాత్రలో నటించనుంది.

కన్నడలో కిరిక్ పార్టీ సినిమాతో కెరీర్ ప్రారంభించిన రష్మిక మందన్నా, ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్‌గా మెప్పిస్తుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ నేషనల్ క్రష్‌ చేతినిండా సినిమాలు ఉండడంతో తీరిక లేకుండా ఉంది. గత సంవత్సరం “పుష్ప 2” మరియు “యానిమల్” చిత్రాలతో ఘన విజయాలు సాధించిన రష్మిక, ఈ రెండు సినిమాలతో బాక్సాఫీస్‌ను కుదిపేసింది. ఇంతటి విజయాలతో ఆమె పేరు మరింతగా మారుమోగింది. ప్రస్తుతం రష్మిక లేడీ ఓరియెంటెడ్ చిత్రాల నుంచి బాలీవుడ్ హిస్టారికల్ చిత్రాల వరకు విభిన్న పాత్రల్లో నటిస్తోంది.ఈ క్రమంలో, బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న “ఛావా” చిత్రంలో రష్మిక, మహారాజా సంభాజీ మహారాజ్ భార్య మహారాణి యసుబాయ్ పాత్రను పోషిస్తోంది. తాజాగా, ఈ చిత్రానికి సంబంధించిన రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.

రష్మిక సరికొత్త పాత్రలో నటించనుంది.
రష్మిక సరికొత్త పాత్రలో నటించనుంది.

మహారాణి యసుబాయ్ పాత్రలో రష్మిక పట్టుచీరలో, ఒంటినిండా ఆభరణాలతో రాజసం ఉట్టిపడేలా కనిపిస్తుంది. రెండు ఫస్ట్ లుక్ పోస్టర్లలో ఒకటి ఆమె చిరునవ్వుతో కన్పిస్తే, మరొకటి గంభీరమైన వ్యక్తిత్వంతో కనిపిస్తుంది. ఈ పోస్టర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మరాఠా యోధుడు మహారాజా సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న “ఛావా”లో విక్కీ కౌశల్, రష్మికతో పాటు అక్షయ్ ఖన్నా, అషుతోష్ రాణా, దివ్య దత్తా వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు. లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను జనవరి 22న విడుదల చేయనున్నారు.ఈ గ్రాండ్ హిస్టారికల్ మూవీని ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. రష్మిక ఈ చిత్రంలో పాత్రతో తనకున్న నటనాశక్తిని మరోసారి నిరూపించనుందని అభిమానులు భావిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870