Rajinikanth autobiography : భారత సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన సూపర్‌స్టార్ రజినీకాంత్ అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇచ్చారు. తానే స్వయంగా తన జీవిత కథను రాయడం ప్రారంభించారని ఆయన కూతురు, దర్శకురాలు సౌందర్య రజినీకాంత్ వెల్లడించారు. ఈ ప్రకటనతో అభిమానుల్లో ఉత్సాహం ఒక్కసారిగా పెరిగిపోయింది.
తాజాగా తన సినిమా With Love ప్రమోషన్ల సందర్భంగా (Rajinikanth autobiography) మాట్లాడిన సౌందర్య, రజినీ ఆత్మకథ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “బెంగళూరులో బస్ కండక్టర్‌గా పనిచేసిన రోజులు నుంచి, చెన్నై వచ్చి సినిమా రంగంలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్న ప్రయాణం వరకు అన్నీ ఈ పుస్తకంలో ఉంటాయి” అని తెలిపారు.
Read Also: KCR phone tapping case : కేసీఆర్ ఇంటికి సిట్ అధికారులు! ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
ఇప్పటివరకు బయటకు రాని ఎన్నో విషయాలు, ఆయన ఎదుర్కొన్న కష్టాలు, ప్రతి పాత్ర వెనుక ఉన్న శ్రమ, జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటనలు ఈ ఆత్మకథలో చోటు చేసుకుంటాయని చెప్పారు. దగ్గరి వారికి కూడా తెలియని అనుభవాలు ఇందులో ఉంటాయని సౌందర్య వ్యాఖ్యానించారు.
రజినీకాంత్ తన మాటల్లోనే తన జీవితాన్ని చెప్పడం వల్ల ఈ పుస్తకం మరింత నిజాయితీగా, ప్రేరణగా ఉండనుందని అభిమానులు భావిస్తున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలు, సినీ ప్రయాణం, వ్యక్తిగత ఆలోచనలు, అభిమానులతో ఉన్న అనుబంధం అన్నీ ఇందులో ప్రతిబింబించనున్నాయి.
ప్రస్తుతం ఆత్మకథ విడుదల తేదీ, పబ్లిషర్ వివరాలు వెల్లడించలేదు. అయినప్పటికీ, ఈ పుస్తకం విడుదలైతే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: