📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే..

RajaSaab movie : హైదరాబాద్ లులు మాల్‌లో రాజాసాబ్ టీమ్ సందడి…

Author Icon By Sai Kiran
Updated: December 17, 2025 • 11:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

RajaSaab movie : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా ‘రాజాసాబ్’ ప్రమోషన్స్‌కు ఊపు వచ్చింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సాంగ్ ‘రెబల్ సాబ్’ యూట్యూబ్‌లో మంచి స్పందన పొందగా, తాజాగా విడుదలైన రెండో పాట ‘సహనా సహనా’ ప్రోమో కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఈ పాటను గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి చిత్ర బృందం ప్రత్యేక ఈవెంట్ ప్లాన్ చేసింది. హైదరాబాద్‌లోని లులు మాల్ వేదికగా ‘సహనా సహనా’ ఫుల్ సాంగ్‌ను విడుదల చేయనున్నారు. దీంతో మాల్‌లో రాజాసాబ్ టీమ్ సందడి చేయనుందని ఫ్యాన్స్‌లో ఆసక్తి పెరిగింది.

దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ హారర్ కామెడీ మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది. అయితే పలుమార్లు వాయిదా పడటం, టీజర్-ట్రైలర్ ఆశించిన స్థాయిలో హైప్ తీసుకురాకపోవడంతో సినిమా పై అంచనాలు కొంతమేర తగ్గిన మాట నిజమే.

Read also: TG Panchayat Elections: మూడవ విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం

ఇదిలా ఉండగా, ఇప్పుడు సినిమా నిడివి అంశం (RajaSaab movie) చర్చనీయాంశంగా మారింది. షూటింగ్ పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా మొదట నాలుగు గంటలకుపైగా ఫుటేజ్‌తో ఉందని సమాచారం. భారీ ఎడిటింగ్ చేసినప్పటికీ, నిడివిని మూడు గంటల కంటే తక్కువకు తీసుకురావడం కష్టమయ్యిందట.

చివరికి ప్రభాస్, దర్శకుడు మారుతి కలిసి చర్చించి సుమారు 3 గంటల 10 నిమిషాల నిడివిని ఫైనల్ కట్‌గా లాక్ చేశారని టాక్ వినిపిస్తోంది. హారర్ కామెడీ జానర్ కావడంతో పాటలు, కామెడీ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని సమాచారం.

ఈ రోజుల్లో ప్రేక్షకులు పొడవైన సినిమాలపై అంత ఆసక్తి చూపడం లేదన్న అభిప్రాయం ఉన్నా, కంటెంట్ బలంగా ఉంటే నిడివి పెద్ద సమస్య కాదని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభాస్ స్టార్ పవర్, సంక్రాంతి సీజన్ కలిసి వస్తే ‘రాజాసాబ్’ ఎలా నిలబడుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Lulu Mall Hyderabad event Maruthi director movie Prabhas RajaSaab Prabhas upcoming movie RajaSaab latest updates RajaSaab movie RajaSaab promotions RajaSaab runtime Sahana Sahana song launch Sankranti Telugu movies Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.