Pushpa 2 Japan Box Office: జపాన్‌లోనూ పుష్ప 2 బాక్సాఫీస్ రికార్డులు

Read Time:  1 min
Pushpa 2 Japan Box Office: జపాన్‌లోనూ పుష్ప 2 బాక్సాఫీస్ రికార్డులు
FONT SIZE
GET APP

Pushpa 2 Japan Box Office: జపాన్ బాక్సాఫీస్ వద్ద ‘పుష్ప’ గాలులు వీస్తున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఖండాతరాలు దాటి జపాన్ ప్రేక్షకులను సైతం ఊపేస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘పుష్ప 2: ది రూల్’ జపాన్‌లో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతోంది.

Read Also: Vijay Sethupathi: రామాయణం సినిమాలో ‘మక్కల్ సెల్వన్’?

జపాన్ బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ ప్రభంజనం

జనవరి 16న జపాన్‌లో ‘పుష్ప కున్రిన్’ పేరుతో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం, తొలి రోజు నుంచే భారీ వసూళ్లను రాబడుతోంది. కేవలం 14 రోజుల్లోనే ఈ చిత్రం సుమారు రూ. 6.06 కోట్ల వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. జపాన్ గడ్డపై అల్లు అర్జున్ మేనరిజం, డాన్సులు మరియు యాక్షన్ సీక్వెన్స్‌లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

Pushpa 2 Japan Box Office
Pushpa 2 box office records in Japan too

ధూమ్ 3 రికార్డు బద్ధలు.. టాప్ 10 జాబితాలోకి!

ఈ వసూళ్లతో ‘పుష్ప 2’ ఒక అరుదైన మైలురాయిని చేరుకుంది. జపాన్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి పది భారతీయ చిత్రాల జాబితాలో ఈ సినిమా చోటు సంపాదించుకుంది. ఈ క్రమంలో గతంలో అమీర్ ఖాన్ నటించిన ‘ధూమ్ 3’ లైఫ్ టైమ్ కలెక్షన్లను అధిగమించి, ప్రస్తుతం 10వ స్థానానికి చేరుకుంది. సినిమా టాక్ పాజిటివ్‌గా ఉండటంతో రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయమనిపిస్తోంది.

జపాన్‌లో ఇండియన్ సినిమాల జోరు

ప్రస్తుతానికి జపాన్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) రూ. 139.73 కోట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత స్థానాల్లో ముత్తు, బాహుబలి వంటి చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ‘పుష్ప 2’ సాధిస్తున్న విజయం చూస్తుంటే, జపాన్‌లో భారతీయ సినిమాలకు, ముఖ్యంగా సౌత్ సినిమాలకు ఉన్న క్రేజ్ మరోసారి నిరూపితమైంది. అల్లు అర్జున్ ఈ విజయంతో జపాన్‌లో తనకంటూ ఒక బలమైన మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Siva Prasad

రచయిత గురించి

Siva Prasad

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.