Producer Mullapudi : నిర్మాత ముళ్లపూడి కన్నుమూత

Read Time:  1 min
Mullapudi Brahmanandam dies
Mullapudi Brahmanandam dies
FONT SIZE
GET APP

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం (68) మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి.

బుధవారం అంత్యక్రియలు

ముళ్లపూడి బ్రహ్మానందం కుమారుడు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఆయన రాగానే బుధవారం కుటుంబ సభ్యులు అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు అధికారికంగా వెల్లడించారు. సినీ ప్రముఖులు, సన్నిహితులు ఆయన మరణానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Mullapudi Brahmanandam
Mullapudi Brahmanandam

ఈవీవీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు

ముళ్లపూడి బ్రహ్మానందం, దివంగత ఈవీవీ సత్యనారాయణ కు అత్యంత సన్నిహిత బంధువు. ఈవీవీ సినిమాలకు ఆయన ప్రత్యేకంగా మద్దతుగా నిలిచేవారు. తన కెరీర్‌లో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించి, ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు.

హిట్ సినిమాల నిర్మాత

నిర్మాతగా “నేను”, “అల్లుడుగారు వచ్చారు”, “మనోహరం”, “ఓ చిన్నదానా” వంటి విజయవంతమైన సినిమాలను అందించారు. ఆయన నిర్మించిన చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముళ్లపూడి బ్రహ్మానందం మృతితో టాలీవుడ్ మరో అనుభవజ్ఞుడైన నిర్మాతను కోల్పోయింది.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.