సినిమా ప్రపంచంలో భారీ అంచనాలతో రూపొందుతున్న “కన్నప్ప” చిత్రంపై ప్రత్యేకంగా ఆసక్తి పెరిగింది. ఈ సినిమాలో మంచు విష్ణు టైటిల్ పాత్రలో నటిస్తుండగా, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్, మోహన్ బాబు వంటి అగ్ర నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పలు పోస్టర్స్ విడుదలయ్యాయి, వాటికి మంచి స్పందన వచ్చింది. తాజాగా, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది.ఈ సినిమాలో మంచు విష్ణు కన్నప్ప పాత్రలో కనిపించనున్నారు. ఇందులో అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ శివపార్వతులుగా కనిపిస్తారు వీరిద్దరి పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే ప్రభాస్ పాత్రపై అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు.ఆయన ఈ చిత్రంలో ఏ పాత్రలో నటిస్తున్నారో, ఆయన ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో అన్న ప్రశ్నలకు చాలా కాలంగా జవాబు చుస్కోవాలని వేచిచూసిన వారు మరెంతో ఉత్సుకతతో ఉన్నారు.ఇక, ఈ రోజు (ఫిబ్రవరి 3న) ప్రభాస్ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ మేకర్స్ విడుదల చేశారు.ఈ పోస్టర్ ద్వారా ప్రభాస్ “రుద్ర” అనే పాత్రలో కనిపిస్తారని క్లారిటీ ఇచ్చారు. ఈ పోస్టర్‌లో ప్రభాస్ మిడిల్ స్లీవ్ కాషాయ దుస్తులు, మెడలో రుద్రాక్ష మణికలు, పెద్ద జుట్టుతో ఆకట్టుకున్నట్లు కనిపించారు.
“ప్రళయ కాల రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పరిపాలకుడు” అనే డైలాగ్‌ను డైలాగ్ కింగ్ మోహన్ బాబు వాయిస్‌లో వినిపించారు.ఈ సినిమాను 2025 ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. భారీ బడ్జెట్‌తో, మోహన్ బాబు సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే, మంచు విష్ణు కూతుర్లు, కొడుకులు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.”కన్నప్ప” సినిమాపై క్రితంగా సృష్టించుకున్న అంచనాలు తప్పకుండా మెప్పించేలా, ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేలా ఉండబోతుంది.