ఇప్పటికే మారుతీ తో రాజాసాబ్ చేసి డిజాస్టర్ అందుకున్న ప్రభాస్ ..మరోసారి ఆయనతో సినెమా చేసేందుకు ఓకే చెప్పాడనే వార్త అభిమానులకు కలవరపెడుతుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్’ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ‘సలార్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్‌తో హోంబలే ఫిల్మ్స్ ఇప్పటికే మూడు సినిమాల ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మారుతిని ప్రభాస్ స్వయంగా హోంబలే సంస్థకు సిఫార్సు చేశారని, ఇప్పటికే ఆయనకు అడ్వాన్స్ కూడా అందినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం మారుతి ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో ఉన్నాడని సమాచారం. ప్రభాస్ తన చేతిలో ఉన్న ప్రస్తుత ప్రాజెక్టులు (సలార్ 2, స్పిరిట్ వంటివి) పూర్తి చేసిన తర్వాత, ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. పూర్తిస్థాయి వినోదం మరియు యాక్షన్ అంశాలతో ఈ సినిమా ఉండబోతుందని ప్రచారం. మరి నిజంగా మారుతీ చేస్తాడా..? అనేది చూడాలి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com