📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Prabhakar statement : కొడుకు తప్పును సమర్థించను, కానీ! ప్రభాకర్ క్లారిటీ

Author Icon By Sai Kiran
Updated: February 7, 2026 • 7:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Prabhakar statement : ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తన కుమారుడు, హీరో Chandrahass పాడిన పాటపై చెలరేగిన వివాదంపై నటుడు Prabhakar స్పందించారు. ఈ మేరకు వీడియో విడుదల చేసిన ఆయన, తన కుటుంబ సభ్యులను ఉద్దేశించి వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక చిన్న తప్పును ఆధారంగా చేసుకుని తన పెంపకాన్ని ప్రశ్నించడం సరికాదని అన్నారు.

గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో తన కుమారుడు ఉపయోగించిన కొన్ని అసభ్యకర పదాలపై తీవ్ర చర్చ జరుగుతోందని ప్రభాకర్ పేర్కొన్నారు. “నా కొడుకైనా, మరెవరైనా ఇలాంటి పదాలు వాడితే అది తప్పే అని చెబుతాను. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి ప్రవర్తనను ప్రోత్సహించను” అని స్పష్టం చేశారు. ఈవెంట్ అనంతరం వ్యక్తిగతంగా తన కుమారుడికి అలాంటి పాటలు పాడకూడదని చెప్పినట్లు వెల్లడించారు.

Read Also: Phone: నోట్లో పేలిన ఫోన్ బ్యాటరీ!

Prabhakar statement

తప్పును ఎత్తి చూపడంలో తప్పు లేదని, కానీ ఆ తప్పును (Prabhakar statement) చూపిస్తూ మరికొందరు ఇంకా ఎక్కువ అసభ్య పదాలు ఉపయోగించడం సరైంది కాదని అన్నారు. ఆ పాటలో రెండు మూడు అనుచిత పదాలు ఉంటే, వాటిని ప్రస్తావిస్తూ ఇరవై, ముప్పై పదాలు వినిపించడం బాధ్యతగా అనిపించదని వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమానికి తన భార్య, కూతురు హాజరు కాలేదని, అయినప్పటికీ వారిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం బాధ కలిగించిందని తెలిపారు. తన కుమారుడి ప్రవర్తన వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని బహిరంగంగా కోరారు. అలాగే దర్శకులు JD Chakravarthy, Jayant C Paranjee లకు కూడా ఆయన క్షమాపణలు చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Barabar Premista pre release issue Breaking News in Telugu celebrity clarification news Chandrahass song controversy Google News in Telugu Latest News in Telugu obscene song controversy Prabhakar statement Prabhakar video message Telugu movie event controversy Telugu News Tollywood latest controversy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.