ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ‘ఓజీ’ (OG)ఫీవర్ ఉధృతంగా కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ గతంలో చేసిన సినిమాలకన్నా ఈ సినిమాపై ఉన్న అంచనాలు, అభిమానుల ఉత్సాహం పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాయి. కేవలం అభిమానులే కాదు, సినీ ప్రముఖులు కూడా ఈ చిత్ర విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమం పూర్తవగా, ‘A’ సర్టిఫికేట్ లభించింది. అలాగే 154 నిమిషాల రన్ టైమ్‌ను ఫైనల్‌గా లాక్ చేయడంతో సినిమా పొడవు, ప్రదర్శన పద్ధతిపై కూడా చర్చ నడుస్తోంది.
కథ విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్(Pawan) ఈ సినిమాలో ఒజాస్ గంభీరా అనే శక్తివంతమైన డాన్ పాత్రలో కనిపించనున్నారు. అండర్ వరల్డ్‌లో ఎదిగిన ఆయన, కొన్ని పరిస్థితుల వల్ల దూరమైపోతారు. కానీ ఇమ్రాన్ హష్మీ పోషించిన ఒమి బాబు అనే ప్రతినాయకుడు మాఫియా సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోవడానికి చేసిన అరాచకాలు పవన్‌ను తిరిగి రంగంలోకి దింపుతాయి. ఈ క్రమంలో ఫ్లాష్‌బ్యాక్‌లో చూపించే పవన్ యాక్షన్ సన్నివేశాలు ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ అవుతాయని సమాచారం. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్‌లో వచ్చే ట్విస్ట్ తర్వాత కథ మరింత ఉత్కంఠభరితంగా సాగేలా దర్శకుడు సుజీత్ ప్లాన్ చేశారని తెలుస్తోంది.
ఇటీవల జరిగిన ఓజీ కాన్సర్ట్ సినిమా హైప్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ ‘ఓజీ లుక్’లో హాజరుకావడం అభిమానులను ఉర్రూతలూగించింది. వర్షం వల్ల కార్యక్రమం కొంత భంగపడినా, అభిమానుల ఉత్సాహం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. శ్రియా రెడ్డి, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, థమన్, దిల్ రాజు, అల్లు అరవింద్ వంటి పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరై వేడుకను రంజింపజేశారు. ట్రైలర్‌ను పబ్లిక్‌గా రిలీజ్ చేయకపోయినా, ఈవెంట్‌లో లైవ్ స్క్రీనింగ్ చూపించడం అభిమానులను మరింత ఎగ్జైట్ చేసింది. మొత్తానికి, పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ‘ఓజీ’ ఒక మార్క్ సినిమాగా నిలవబోతుందన్న అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.