📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం

Kannappa: ‘కన్నప్ప’ షూటింగ్ డేటాతో ఆఫీస్ బాయ్ పరార్

Author Icon By Shobha Rani
Updated: May 27, 2025 • 2:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

స్టార్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa) మూవీ జూన్ 27న రిలీజ్ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్​పై దృష్టి పెట్టారు. గ్రాండ్​గా రిలీజ్ చేసేందుకు ప్లాన్స్ చేస్తున్నారు. కానీ, ఇంతలోనే మూవీ టీమ్​కు భారీ షాక్ తగిలింది. అయితే, సినిమా టీమ్‌కి అనూహ్యమైన షాక్ తగిలింది – మూవీకి సంబంధించిన కీలక హార్డ్‌డ్రైవ్‌ (Hard Disk) చోరీకి గురైంది.సినిమాకు సంబంధించిన హార్డ్​డ్రైవ్​(Hard Disk)ను ఇద్దరు వ్యక్తులు అనుమతి లేకుండా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Kannappa: ‘కన్నప్ప’ హార్డ్‌డ్రైవ్‌తో ఆఫీస్ బాయ్ పరార్ – షూటింగ్ డేటా మిస్!

పోలీసుల కథనం ప్రకారం
కోకాపేటకు చెందిన రెడ్డి విజయ్‌కుమార్‌ 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ‘కన్నప్ప’ (Kannappa) సినిమాకు సంబంధించి కీలకమైన కంటెంట్‌ ఉన్న హార్డ్‌డ్రైవ్‌(Hard Disk)ను ముంబయిలోని HIVE స్టూడియోస్‌ వారు ఓ ప్రైవేట్ కొరియర్‌ ద్వారా ఫిల్మ్‌నగర్‌లోని విజయ్‌కుమార్‌ ఆఫీస్​కు పంపించారు. అయితే ఈ పార్శిల్‌ను ఈ నెల 25న ఆఫీస్‌బాయ్‌ రఘు తీసుకున్నాడు. అతడు ఈ విషయం ఎవరికీ చెప్పకుండా హార్డ్‌డ్రైవ్‌(Hard Disk)ను చరిత అనే మహిళకు అప్పగించాడు. ఆ అమ్మాయి తన ప్రియురాలు అని తెలిసింది. ఇక అప్పటి నుంచి వారు ఎవరికీ కనిపించకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. ఎవరి మార్గదర్శకత్వంలోనో తమ ప్రాజెక్టుకు నష్టం కలిగించాలనే దురుద్దేశంతో రఘు, చరిత కలిసి హార్డ్‌డ్రైవ్‌(Hard Disk)ను దొంగిలించారని ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ విజయ్‌కుమార్‌ హైదరాబాద్​ ఫిల్మ్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. హీరో విష్ణు రీసెంట్​గా ఓ ఇంటర్వ్యూలో సినిమా రన్​టైమ్ గురించి క్లారటీ ఇచ్చారు. ఈ సినిమా రన్ టైమ్​ 3గంటల 10 నిమిషాలు ఉంటుందని విష్ణు వెల్లడించారు. క్లైమాక్స్​లో స్టోరీ ఫ్లో​ కంటిన్యూ చేయడానికి ఫైనల్​ ఎడిటింగ్​లో కొన్ని ప్రభాస్ సన్నివేశాలను తీసేశామని చెప్పారు. అయినా ప్రభాస్ స్క్రీన్ టైం దాదాపు 30 నిమిషాలు ఉంటుందని, కీలక పాత్రలో ఆయన కనిపిస్తారని విష్ణు పేర్కొన్నారు. కాగా, విష్ణు కన్నప్ప (Kannappa) పాత్రలో నటిస్తుండగా, స్టార్ హీరో ప్రభాస్​, మోహన్​ బాబు, మోహన్​లాల్​, అక్షయ్ కుమార్ కాజల్​ ఆగర్వాల్, శరత్ కుమార్, అర్పిత్ రాంకా, ప్రీతి ముకుందన్ ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Read Also: Vijay Deverakonda : డైరెక్టర్‌కు గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ

'Kannappa' hard drive #telugu News Breaking News in Telugu Google news Latest News in Telugu Office boy missing with Paper Telugu News Telugu News online Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.