హీరోల జీవితాలపై కాకుండా తమ వ్యక్తిగత జీవితాలపై దృష్టి పెట్టాలని తమిళ స్టార్ హీరో అజిత్ తన అభిమానులకు సూచించారు. తన అభిమానులు తమ జీవితంలో విజయవంతమైతే అది తనకు ఎంతో ఆనందంగా ఉంటుందని అన్నారు. ఈ సందేశం ద్వారా ఆయన ఫ్యాన్స్‌కు ప్రేరణ నిచ్చే ప్రయత్నం చేశారు. సినిమాలు మన జీవితంలో వినోదం కోసం మాత్రమే అని, వాటిని ఆస్వాదించడంలో తప్పు లేదని అజిత్ చెప్పారు. అయితే, వ్యక్తిగత జీవితానికి ముఖ్యత్వం ఇవ్వడం చాలా అవసరమని, అందుకోసం కృషి చేయాలని సూచించారు.
తన అభిమానులు ఇతర నటీనటులనూ గౌరవించాలని అజిత్ స్పష్టం చేశారు. తమ అభిమాన హీరోల కోసం ఇతర నటీనటులపై విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని చెప్పారు. అభిమానం అనేది సరైన మార్గంలో ఉంటేనే అందరికీ ప్రయోజనకరమని అజిత్ తెలిపారు. గతం గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృథా చేయకుండా, ప్రస్తుతాన్ని చక్కగా గడపాలని అజిత్ అన్నారు. ఫ్యూచర్ కోసం ప్రస్తుతంలో కష్టపడితేనే జీవితంలో విజయాలు సాధించగలమని ఆయన తన అభిమానులకు సూచించారు. అభిమానులంతా తమ జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తే, తమకు ఉన్న ప్రతిభను మరింత మెరుగుపరచుకోవచ్చని అజిత్ నమ్మకంగా చెప్పారు. ఆయన చెప్పిన ఈ సూచనలు ఫ్యాన్స్‌కి మార్గదర్శకంగా నిలుస్తాయని అనిపిస్తోంది.