📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Telugu News: Nagarjuna: ‘శివ’ మూవీ చిన్నారి ఇప్పుడెలా ఉన్నారంటే?

Author Icon By Tejaswini Y
Updated: November 12, 2025 • 12:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అక్కినేని నాగార్జున (Nagarjuna) దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) కలయికలో 1989లో విడుదలైన ‘శివ’ సినిమా తెలుగు సినీ చరిత్రలో ఒక సూపర్ కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయింది. ఆ సినిమా టెక్నికల్ ఎక్సలెన్స్, స్టోరీ ట్రీట్‌మెంట్‌తో ఇండియన్ సినిమాకే కొత్త దిశ చూపిందని అప్పట్లో విమర్శకులు పేర్కొన్నారు. ఇప్పుడు, 35 ఏళ్ల తర్వాత ఆ లెజెండరీ చిత్రం రీ-రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో నాగార్జున మరియు ఆర్జీవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. అయితే, ఈ రీ రిలీజ్ సందర్బంగా ఆర్జీవీ చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

Read Also: Tirumala: విస్తుగొలుపుతున్న పరకామణి చోరీ కేసు

ఆ ట్వీట్‌లో ఆయన ‘శివ’ సినిమాలో మురళీ మోహన్ కుమార్తె పాత్రలో నటించిన చిన్నారి సుష్మ (Sushma) గురించి ప్రస్తావించారు. సినిమాలో “బాబాయ్!” అంటూ నాగార్జున పాత్ర వెనుక తిరుగుతూ కనిపించే ఆ చిన్నారి అప్పట్లో ప్రేక్షకుల హృదయాల్లో ముద్ర వేసింది. ముఖ్యంగా నాగార్జున ఆమెను సైకిల్‌పై తీసుకెళ్లే ఛేజ్ సీన్‌ ఇప్పటికీ అభిమానులు గుర్తుంచుకుంటారు.

సుష్మ ఆనంద్ అకోజు

ఇప్పుడు ఆ సుష్మ ఎక్కడుంది? ఏం చేస్తోంది? అనే ప్రశ్నకు సమాధానం ఆర్జీవీ ట్వీట్‌లోనే లభించింది. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఆ చిన్నారి ఇప్పుడు అమెరికాలో AI మరియు Cognitive Science రంగాల్లో రీసెర్చ్ చేస్తున్నారు. దీనిపై సుష్మ కూడా స్పందిస్తూ, “శివ సినిమా లెగసీలో నా పేరు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు సర్. ఆ అనుభవం నా జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకం” అంటూ ట్వీట్ చేశారు.

సుష్మ పూర్తి పేరు సుష్మ ఆనంద్ అకోజు. ఆమె తెలుగు మూలాలు కలిగిన భారతీయురాలు. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తూ సైన్స్ సంబంధిత పరిశోధనల్లో నిమగ్నమై ఉంది. ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ప్రైవేట్‌లో ఉండడంతో నెటిజన్లు ఇప్పుడు ఆమె గురించి మరింత తెలుసుకోవాలని ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు, నవంబర్ 14న విడుదల కాబోతున్న ‘శివ’ రీ రిలీజ్‌పై అభిమానుల్లో భారీ ఎక్సైట్మెంట్ కనిపిస్తోంది. మూడు దశాబ్దాల తర్వాత కూడా ఆ సినిమా ప్రభావం తగ్గకపోవడం, ఆర్జీవీ నాగార్జున కాంబో మ్యాజిక్‌ ఇంకా ఫ్యాన్స్‌లో ఉందని చెప్పాలి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

nagarjuna NagarjunaFans RamGopalVarma RGV RGVTweets ShivaChildArtist ShivaMovie ShivaReRelease TeluguCinema TollywoodNews

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.