ప్రఖ్యాత కోలీవుడ్ గోల్డెన్ క్వీన్ అవార్డుల వేడుకలో ప్రముఖ నటి సమంత గోల్డెన్ క్వీన్ అవార్డు అందుకున్నారు. ఈ పురస్కారం ఆమె సినీ రంగానికి అందించిన సేవలకు గుర్తింపుగా ఇచ్చారు. ఈ సందర్భంగా సమంత తన జీవితంలోని భావోద్వేగ సందర్భాలను పంచుకుంటూ, ముఖ్యంగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌తో ఉన్న అనుబంధాన్ని ప్రస్తావించారు.
నా జీవితంలో అతని పాత్రను మాటల్లో చెప్పలేను
“నేను ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో ఉండగా, రాహుల్ రవీంద్రన్ నా వెంటే ఉన్నాడు. రోజంతా ఆసుపత్రిలో ఉండి, నా పరిస్థితిని చూస్తూ, నన్ను ధైర్యపర్చాడు. నా జీవితంలో అతని పాత్రను మాటల్లో వివరించలేను. అతడు నాకు ఫ్రెండ్, బ్రదర్, ఫ్యామిలీ మెంబర్ – ఏ పేరున పిలవాలో తెలియడంలేదు. మా అనుబంధానికి పేరు పెట్టలేను” అంటూ ఆమె తన కృతజ్ఞతలు తెలియజేశారు.
రాహుల్ రవీంద్రన్‌తో ఆమె ఉన్న స్నేహబంధం అందరికీ ఆదర్శం
సమంత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాహుల్ రవీంద్రన్‌తో ఆమె ఉన్న స్నేహబంధం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఈ సందర్భంగా అభిమానులు కూడా సమంత ధైర్యాన్ని, ఆమె వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తున్నారు. వ్యక్తిగత జీవితాన్ని అందరితో పంచుకుంటూ, నిజమైన అనుబంధాన్ని గుర్తించిన సమంత స్పూర్తిదాయకంగా మారింది.