mrunal thakur : ‘సీతా రామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలిచిన నటి మృణాల్ ఠాకూర్, ఇప్పుడు మరోసారి క్రేజీ అప్‌డేట్‌తో వార్తల్లో నిలిచారు. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం **పెద్ది**లో ఆమె ఒక ప్రత్యేక గీతంలో అలరించనున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో టాక్ నడుస్తోంది.
ఈ స్పెషల్ సాంగ్ కోసం ఇప్పటికే చిత్ర నిర్మాతలు మృణాల్‌ను సంప్రదించారని, ఇది భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో ఆమె వెంటనే అంగీకరించినట్లు సమాచారం. ఈ పాటను భారీ స్థాయిలో, ప్రత్యేకంగా రూపొందించిన సెట్లో చిత్రీకరించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
Read Also: SONY- TCL: హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో కీలక పరిణామం
ఇక ఈ ఐటెం సాంగ్‌కు లెజెండరీ (mrunal thakur) సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ ఓ హుషారైన ట్యూన్‌ను సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల అగ్ర కథానాయికలు ప్రత్యేక గీతాల్లో కనిపించడం ట్రెండ్‌గా మారిన నేపథ్యంలో, మృణాల్ ఈ పాటతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే అంచనాలు పెరిగాయి
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: