తమిళ స్టార్ హీరో ధనుష్ మరియు టాలీవుడ్ సెన్సేషన్ మృణాల్ ఠాకూర్ త్వరలో వివాహం చేసుకోబోతున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్ని నెలలుగా వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నప్పటికీ, తాజాగా వినిపిస్తున్న వార్త సినీ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వీరిద్దరూ వచ్చే ఫిబ్రవరి 14న (ప్రేమికుల రోజు) అత్యంత సన్నిహితుల సమక్షంలో ఒకటవబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
Talasani : తలసానిపై కేసు.. వివాదం ఏంటి?
ఈ వార్త ప్రాచుర్యంలోకి రావడానికి ప్రధాన కారణం వీరి మధ్య పెరిగిన సాన్నిహిత్యమే. గతంలో కూడా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ పలు కథనాలు వెలువడ్డాయి. అప్పట్లో మృణాల్ ఠాకూర్ స్పందిస్తూ, అవన్నీ కేవలం పుకార్లేనని కొట్టిపారేశారు. అయితే, ఇప్పుడు తేదీతో సహా (ఫిబ్రవరి 14) వివాహ వార్తలు వస్తుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ధనుష్ తన వ్యక్తిగత జీవితం గురించి చాలా గోప్యంగా ఉంటారు, ఇక మృణాల్ కూడా తన కెరీర్‌పైనే దృష్టి పెట్టినట్లు కనిపిస్తున్న తరుణంలో ఈ వార్తలు వెలువడటం విశేషం.
అయితే, ఈ ప్రచారంపై ధనుష్ గానీ, మృణాల్ గానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. సాధారణంగా సెలబ్రిటీల విషయంలో ఇటువంటి పుకార్లు రావడం సహజమే అయినా, వీరిద్దరూ ఒక్కటవుతారనే వార్త తమిళ మరియు తెలుగు చిత్ర పరిశ్రమల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. వీరిద్దరూ కలిసి ఏదైనా సినిమాలో నటిస్తున్నారా లేదా నిజంగానే వ్యక్తిగత బంధాన్ని ముందుకు తీసుకెళ్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com