📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధరలు ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధరలు ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్

Mega157 : మెగా 157 కేరళలో మూడో షెడ్యూల్ పూర్తి

Author Icon By Sudheer
Updated: July 23, 2025 • 7:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి (Chiranjeevi – Anilravipudi)కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా సినిమా మెగా157 (Mega157)షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు రెండు షెడ్యూల్లు పూర్తవగా, తాజాగా కేరళలో మూడో షెడ్యూల్‌ను కూడా ముగించారు. ఈ విషయాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “మన శంకరవరప్రసాద్ గారు ముచ్చటగా మూడో షెడ్యూల్‌ను కేరళలో పూర్తి చేసుకున్నారు” అంటూ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియోలో చిరంజీవి, అనిల్ రావిపూడి చార్టర్డ్ విమానంలో హైదరాబాద్‌కు చేరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.

చిరుకు జోడిగా నయనతార

ఇప్పటివరకు సినిమా టైటిల్‌ను అధికారికంగా ఖరారు చేయలేదు. అందువల్ల మెగా157 అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుతున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా లేడీ సూపర్‌స్టార్ నయనతార నటిస్తోంది. గతంలో వీరిద్దరూ కలిసి “సైరా నరసింహారెడ్డి” వంటి చిత్రాల్లో కనిపించారు. ఈ కొత్త కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్

ఈ సినిమాకు చిరంజీవి కుమార్తె సుష్మిత చిరంజీవి మరియు సాహు గారపాటి సంయుక్తంగా నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు. అనిల్ రావిపూడి సినిమాలపై మాస్ ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, చిరంజీవి నటనకు ఉన్న ఆదరణ రెండూ కలిసొచ్చే ఈ ప్రాజెక్ట్ పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. మిగిలిన షెడ్యూల్లు పూర్తయిన అనంతరం టైటిల్, ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ లాంటి వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.

Read Also : Gum bleeding: చిగుళ్ల నుంచి రక్తం రావడాన్ని నిర్లక్ష్యం చేయొద్దు..

AnilRavipudi Chiranjeevi Google News in Telugu kerala shooting mega157 mega157 schedule

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.