📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ నేటి బంగారం ధర IPL మినీ వేలం.. భారత్ పై ట్రంప్ మళ్లీ సుంకాల బాదుడు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ నేటి బంగారం ధర IPL మినీ వేలం.. భారత్ పై ట్రంప్ మళ్లీ సుంకాల బాదుడు

Maruva Tarama : ‘మరువ తరమా’ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది – రఘురామ

Author Icon By Sudheer
Updated: November 27, 2025 • 10:20 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్ మీద రమణ మూర్తి గిడుతూరి, రుద్రరాజు ఎన్.వి. విజయ్‌కుమార్ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘మరువ తరమా’. ఈ మూవీలో హరిష్ ధనుంజయ, అతుల్య చంద్ర, అవంతిక హరి నల్వా ప్రధాన పాత్రల్ని పోషించారు. ఈ సినిమాకు చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వం వహించారు. ఈ మూవీ నవంబర్ 28న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో బుధవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణరాజు, నారా రోహిత్, శ్రీవిష్ణు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో..

Dhanush new movie : ధనుష్ బాలీవుడ్ ‘తేరే ఇష్క్ మే’ – తెలుగులో ప్రత్యేక టైటిల్ ‘అమర కావ్యం’ విడుదలకు…

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణరాజు మాట్లాడుతూ .. ‘ఇండస్ట్రీలోకి రావాలని అనుకుంటున్నాను అని చైతన్య చెప్పినప్పుడు ఆలోచించుకోమని అన్నాను. కానీ చైతన్య తనమీద తనకున్న నమ్మకంతో ధైర్యంగా అడుగేశారు. నాకు సినిమాలు చాలా ఇష్టం. రోహిణి గారు అప్పటికీ ఇప్పటికీ ఏమీ మారలేదు. ‘మరువ తరమా’ టీజర్, ట్రైలర్ నాకు చాలా నచ్చాయి. విజువల్స్ అద్భుతంగా అనిపించాయి. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా కథ ఉంది. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నారా రోహిత్, శ్రీ విష్ణు స్నేహబంధానికి ప్రతీక. వారిద్దరూ మంచి మనుషులు, మంచి మిత్రులు. వారిద్దరూ ఈ చిత్ర కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా ప్రజలందరి అభిమానాన్ని చూరగొంటుందని విశ్వసిస్తున్నాను. ఇది జనం మెచ్చే చిత్రం అవుతుంది. చిత్రయూనిట్‌కి ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

నారా రోహిత్ మాట్లాడుతూ .. ‘నవంబర్ 28న ‘మరువ తరమా’ చిత్రం రాబోతోంది. ఈ మూవీలోని సాంగ్స్, లిరిక్స్ బాగున్నాయి. కంటెంట్ కూడా ఫ్రెష్‌గా అనిపిస్తోంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ కూడా బాగున్నాయి. మంచి సినిమా వచ్చినప్పుడల్లా ఆడియెన్స్ ఎంకరేజ్ చేస్తుంటారు. ఈ మూవీని కూడా జనాలు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. హరీష్ మాకు చాలా ఏళ్ల నుంచి మంచి మిత్రుడు. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

శ్రీ విష్ణు మాట్లాడుతూ .. ‘‘నవంబర్ 28న రాబోతోన్న ‘మరువ తరమా’ మూవీని అందరూ చూడండి. ఈ చిత్రంలో మాటలు కూడా పాటల్లా ఉన్నాయి. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. రోహిణి గారు ఓ సినిమా చేశారంటే, పాత్రని ఒప్పుకున్నారంటే జనాలకు ఓ నమ్మకం ఉంటుంది. హరీష్ కోసమే మేం ఇక్కడకు వచ్చాం. హరీష్‌కి మంచి టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్‌ని ఆడియెన్స్ ఇష్టపడతారు. ఇకపై చాలా వేగంగా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. డబ్బు కంటే పేరు కోసం ప్రయత్నిస్తున్న వారందరికీ తెలుగు ఆడియెన్స్ సహకారం ఎప్పుడూ ఉంటుంది. ఈ మూవీని చూసి ఆదరిస్తారని, దీవిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

హరీష్ ధనుంజయ్ మాట్లాడుతూ .. ‘మా ఈవెంట్‌కు వచ్చిన రఘురామ కృష్ణరాజు గారికి థాంక్స్. నా కోసం వచ్చిన నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అయిన నారా రోహిత్, శ్రీ విష్ణులకు థాంక్స్. మా కోసం వచ్చిన దామోదర్ గారికి థాంక్స్. మా సినిమాను ఒప్పుకున్న రోహిణి గారికి థాంక్స్. చైతన్య నాకు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితుడు. చైతూ తన ఫ్రెండ్‌కి జరిగిన రియల్ స్టోరీనే ‘మరువ తరమా’గా మార్చాడు. యూత్ ఆడియెన్స్‌‌కి ఈ చిత్రం బాగా కనెక్ట్ అవుతుంది. మనల్ని మనం చూసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. చైతన్య మంచి లిరిసిస్ట్. అందుకే ఈ సినిమాలో ప్రతీ చోటా పొయెట్రీ కనిపిస్తుంది. సాయి మా అందరినీ అందంగా చూపించాడు. అవంతిక, అతుల్య అద్భుతంగా నటించారు. మా నిర్మాతల సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. వంద శాతం ఈ చిత్రం ఆడియెన్స్‌కి కనెక్ట్ అవుతుంది. ప్రతీ పాత్రకు అందరూ కనెక్ట్ అవుతారు. ప్రతీ ఒక్కరూ థియేటర్ నుంచి ఓ నవ్వుతో బయటకు వస్తారని గ్యారెంటీగా చెప్పగలను. నవంబర్ 28న మా సినిమాను అందరూ చూడండి’ అని అన్నారు.

డైరెక్టర్ చైతన్య వర్మ నడింపల్లి మాట్లాడుతూ .. ‘‘మరువ తరమా’ కోసం వచ్చిన రఘు గారికి, నారా రోహిత్ గారికి, శ్రీ విష్ణు గారికి థాంక్స్. ఈ ప్రయాణంలో మాకు ఎన్ని సవాళ్లు, సమస్యలు వచ్చినా వాటన్నంటినీ దాటుకుని ఇక్కడి వరకు వచ్చాం. ఇదే నాకు పెద్ద విజయం. ఈ జర్నీలో నేను ఎంతో నేర్చుకున్నాను. నిజాయితీగా ఓ అటెంప్ట్ చేశాం. కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయం. ఈ మూవీని చూసి నేను సంతృప్తి చెందాను. ఈ సినిమాను మీడియానే ఆడియెన్స్ వరకు తీసుకు వెళ్తుందని ఆశిస్తున్నాను. ఇక ఈ మూవీ ఫలితాన్ని మీడియా, ఆడియెన్స్‌కే వదిలేస్తున్నాను. అందరూ మా సినిమాను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

నిర్మాత రమణ మూర్తి మాట్లాడుతూ .. ‘‘మరువ తరమా’ ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. చైతన్య చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. చైతూ ఈ మూవీ కోసం ఎంతో కష్టపడ్డాడు. ఈ ప్రయాణంలో మాకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నవంబర్ 28న ఈ మూవీని అందరూ చూసి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

అవంతిక మాట్లాడుతూ .. ‘‘మరువ తరమా’ చిత్రంతో తెలుగు పరిశ్రమలోకి వస్తున్నాను. నన్ను నమ్మి సింధు అనే పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. నాకు ఈ ప్రయాణంలో సహకరించిన టీంకి థాంక్స్. హరీష్, అతుల్య, రోహిణి గార్లతో పని చేయడం ఆనందంగా ఉంది. నవంబర్ 28న మా సినిమా రాబోతోంది. అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నటి రోహిణి మాట్లాడుతూ .. ‘‘మరువ తరమా’ కోసం చైతన్య పడిన కష్టం నాకు తెలుసు. చైత్యనకు పెద్ద విజయం దక్కాలని కోరుకుంటున్నాను. సున్నితమైన కథతో తెరకెక్కించిన చిత్రమిది. ఇందులోని ఎమోషన్ అందరినీ ఆకట్టుకుంటుంది. మరొక మంచి చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాను. నవంబర్ 28న ఈ చిత్రాన్ని ఆడియెన్స్ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

కెమెరామెన్ రుద్రసాయి మాట్లాడుతూ .. ‘‘మరువ తరమా’ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. చైతూ నాకు ఓ ఫ్రెండ్ కంటే గురువులా ఎంతో నేర్పించాడు.. అండగా నిలబడ్డాడు. ఈ మూవీతో నేను ఎంతో నేర్చుకున్నాను. నవంబర్ 28న మా సినిమా రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

మూవీ క్యాస్ట్ & క్రూ :

నటీనటులు: హరిష్ ధనుంజయ, అతుల్య చంద్ర, అవంతిక హరి నల్వా
సాంకేతిక బృందం
బ్యానర్: సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్
నిర్మాతలు: రమణ మూర్తి గిడుతూరి, రుద్రరాజు N. V. విజయ్‌కుమార్ రాజు
రచన & దర్శకత్వం: చైతన్య వర్మ నడింపల్లి
సంగీతం: విజయ్ బుల్గానిన్ & ఆరిష్
DOP: రుద్ర సాయి
ఎడిటర్: కె.ఎస్.ఆర్
కొరియోగ్రఫీ: అజయ్ శివశంకర్

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Maruva Tarama Maruva Tarama movie Maruva Tarama pre release

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.