Telugu short film contest : సంక్రాంతి సందర్భంగా హీరో మంచు విష్ణు ప్రతిభావంతులైన యువ దర్శకులకు శుభవార్త అందించారు. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ‘ఆవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ – 1’ ను ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఆవా ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ పోటీలో పాల్గొనే వారు గరిష్ఠంగా 10 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిల్మ్‌ను సమర్పించవచ్చని తెలిపారు. కథ చెప్పే తీరు, దర్శకత్వ ప్రతిభ, విజన్ ఆధారంగా విజేతను ఎంపిక చేస్తామని మంచు విష్ణు వెల్లడించారు. ఈ పోటీ ద్వారా నిజమైన టాలెంట్‌ను గుర్తించి అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు.
Read also: Jadeja dropped from ODI : జడేజా స్థానం ప్రమాదంలోనా? వన్డే కెరీర్‌పై నీలినీడలు!
ఈ కాంటెస్ట్‌లో విజేతగా నిలిచిన దర్శకుడికి ఏకంగా రూ.10 కోట్ల బడ్జెట్‌తో పూర్తి స్థాయి సినిమా రూపొందించే అవకాశాన్ని ఇస్తామని మంచు విష్ణు స్పష్టం చేశారు. ఇది షార్ట్ ఫిల్మ్ మేకర్స్‌కు ఒక గొప్ప వేదికగా నిలుస్తుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అర్హత ఉన్న దర్శకులను మెయిన్ స్ట్రీమ్ (Telugu short film contest) సినిమాల్లోకి తీసుకురావడమే ఈ పోటీ ప్రధాన ఉద్దేశమని చెప్పిన మంచు విష్ణు, దీనికి సంబంధించిన వివరాలను వివరిస్తూ ఒక ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేశారు. ఈ ప్రకటనతో యువ దర్శకుల్లో ఉత్సాహం నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: