Movierulz : చిత్రసీమకు రూ.3,700 కోట్ల నష్టం తెచ్చిన వ్యక్తి అరెస్ట్

Read Time:  1 min
Movierulz : చిత్రసీమకు రూ.3,700 కోట్ల నష్టం తెచ్చిన వ్యక్తి అరెస్ట్
FONT SIZE
GET APP

సినిమా పరిశ్రమ(Film Industry)కు భారీ నష్టాన్ని కలిగించిన కేసులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కిరణ్ కుమార్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. 2024లో తెలుగు, తమిళ్ సినీ పరిశ్రమలకు సుమారు రూ.3,700 కోట్ల మేర నష్టం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అతను ఇప్పటివరకు 65 పైసీ సినిమాలను రికార్డ్ చేసి ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. అతని కార్యకలాపాలు పరిశీలించిన పోలీసులు, ఈ విషయంలో పలు స్టేట్, సెంట్రల్ ఐటీ శాఖల సహకారంతో చర్యలు తీసుకున్నారు.

విడుదలైన మొదటి రోజే పైరసీ

కిరణ్ కుమార్ (Kiran Kumar) థియేటర్లలో సినిమాలు విడుదలైన తొలి రోజే తన మొబైల్ ఫోన్‌ ద్వారా వాటిని రికార్డ్ చేసేవాడు. అనంతరం ఆ వీడియోలను ప్రముఖ పైరసీ వెబ్‌సైట్లైన ‘మూవీ రూల్జ్’, ‘తమిళ్ ఎంవీ’ వంటివాటికి అందజేసేవాడు. ఒక్కో సినిమా రికార్డింగ్‌ను రూ.40,000 నుంచి రూ.80,000 వరకు అమ్మినట్లు సమాచారం. ఈ మార్గంలో అతడు పెద్ద మొత్తంలో డబ్బును సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు.

సినీ ప్రముఖులు ఆవేదన

ఈ ఘటనపై సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తూ, పైరసీ వల్ల పరిశ్రమ తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. సినిమా తీయడంలో కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టే నిర్మాతలకు ఈ విధమైన దొంగతనాలు పెద్ద ప్రమాదంగా మారుతున్నాయి. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు అవసరమని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఇప్పటికీ సంబంధిత వెబ్‌సైట్లను మూసివేసే చర్యలు చేపట్టినట్లు సమాచారం.

Read Also : iCrime news: మామ మీద మోజు తో భర్తను హత్య చేయించిన భార్య

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.