సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ (Kantara ) చిత్రానికి ప్రీక్వెల్‌గా రూపొందిన ‘కాంతార ఛాప్టర్-1’ నిన్న థియేటర్లలో ప్రీమియర్స్‌కి వచ్చింది. ఈ సినిమాపై ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఒరిజినల్ చిత్రంలోని ఆధ్యాత్మికత, జానపదత్మక వాతావరణం, మైథలాజికల్ టచ్‌లను రిషబ్ శెట్టి ఈ సారి ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో ఎక్కువైంది. ప్రీమియర్ ప్రదర్శనలకు వెళ్లిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
Mass Jathara: అక్టోబర్ 31న థియేటర్లలోకి ‘మాస్ జాతర’
రిషబ్ శెట్టి (Rishab Shetty) ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా ప్రధాన పాత్రలో కూడా నటించారు. ఆయన పర్ఫార్మెన్స్ గురించి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఆయన ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ సీక్వెన్స్ విజువల్ ప్రెజెంటేషన్‌కి, థ్రిల్లింగ్ ఎఫెక్ట్స్‌కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది VFX. ఒరిజినల్ చిత్రంలోని వాస్తవికతను నిలబెట్టుకుంటూనే ఈసారి మరింత విస్తృతమైన స్కేల్‌లో విజువల్స్ చూపించడం గమనార్హం. హీరోయిన్ రుక్మిణీ కూడా తన నటనతో ప్రేక్షకులను మెప్పించిందని కామెంట్లు వస్తున్నాయి.
అయితే ప్రతి అంశం పాజిటివ్‌గా లేదని కొంతమంది పేర్కొంటున్నారు. ముఖ్యంగా నరేషన్ పేస్ కొంచెం స్లోగా ఉందని, కొన్ని సీన్లు మరీ లాగినట్లుగా అనిపించాయని ప్రేక్షకుల అభిప్రాయం. అయినప్పటికీ మొత్తం మీద సినిమా సౌండ్ డిజైన్, మ్యూజిక్, ఆర్ట్ డైరెక్షన్, క్యామరావర్క్ విషయంలో కొత్త ప్రమాణాలు సెట్ చేసిందని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఈ మిశ్రమ స్పందన మధ్య, ‘కాంతార ఛాప్టర్-1’ వసూళ్ల పరంగా ఎలా రాణిస్తుందో చూడాలి అనే ఆసక్తి పెరుగుతోంది.