ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్ల బంద్ (Theatre Bandh ) వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ అంశంలో బంద్‌కు మద్దతు తెలిపిన వ్యక్తి జనసేన నేత అత్తి సత్యనారాయణ(Athi Satyanarayana)గా బయటపడటం సంచలనంగా మారింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు మీడియా సమావేశంలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిబిటర్ల సమావేశంలో అత్తి సత్యనారాయణే ఈ బంద్ అంశాన్ని ప్రస్తావించారని, కానీ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
వైసీపీ నేతతో అనుబంధం అనుమానాలకు దారి
అత్తి సత్యనారాయణ “అనుశ్రీ ఫిల్మ్స్” పేరుతో డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నారు మరియు కొన్ని థియేటర్లను నిర్వహిస్తున్నారు. అయితే ఈ బంద్ ప్రతిపాదన వెనుక వైసీపీకి చెందిన మరో థియేటర్ యజమాని ప్రమేయం ఉండొచ్చన్న అనుమానాలు మూడుతున్నాయి. ఆ వైసీపీ నేత ప్రేరణతోనే సత్యనారాయణ ఈ ప్రతిపాదన చేశారని పరిశ్రమ వర్గాల్లో చర్చ సాగుతోంది. పార్టీకి చెందినవారే బంద్ కుట్ర చేస్తే ఊరించకూడదని పవన్ కళ్యాణ్ చెప్పడంతో అత్తి సత్యనారాయణ ఆందోళనలో పడ్డారు.
పవన్ స్పష్టమైన సూచనలు – ప్రభుత్వం పర్యవేక్షణ పెంచాలి
ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ థియేటర్ల నిర్వహణ పట్ల ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. టికెట్ ధరల పెంపు వంటి అంశాల్లో వ్యక్తిగతంగా కాకుండా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ద్వారా ప్రభుత్వాన్ని సంప్రదించాలని తెలిపారు. ప్రభుత్వ శాఖలు తమ విధులను నిఖార్సైన పద్ధతిలో నిర్వహించాలని పునరుద్ఘాటించారు. హరిహర వీరమల్లు వంటి సినిమా విడుదలకు ముందు ధరల పెంపు కోసం కూడా నిర్మాతలు అధికారికంగా మాత్రమే అనుమతి కోరాలని స్పష్టం చేశారు.
Read Also : Pawan Kalyan : పవన్‌కు థాంక్స్ చెబుతూ ‘దిల్’ రాజు లేఖ