Prashanth varma cinematic : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘హనుమాన్’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘జై హనుమాన్’ సినిమాను దర్శకుడు ప్రశాంత్ వర్మ ఘనంగా ప్రారంభించారు. కర్ణాటకలోని హంపి సమీపంలోని ఆంజనేయుడి జన్మస్థలంగా ప్రసిద్ధి చెందిన అంజనాద్రి కొండపై ప్రత్యేక పూజల మధ్య ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రను ‘కాంతార’ ఫేమ్, జాతీయ అవార్డు గ్రహీత రిషభ్ శెట్టి పోషించనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
ప్రారంభోత్సవ కార్యక్రమానికి రిషభ్ శెట్టి తన భార్య ప్రగతి శెట్టితో కలిసి హాజరయ్యారు. ‘హనుమాన్’ హీరో తేజా సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాతలు తదితరులు పాల్గొన్నారు. ముహూర్తపు షాట్‌కు ప్రముఖ నిర్మాత భూషణ్ కుమార్ క్లాప్ కొట్టగా, అనిల్ థడానీ కెమెరా స్విచాన్ చేశారు. స్క్రిప్ట్ స్వీకరించిన సమయంలో రిషభ్ శెట్టి చూపించిన భక్తి భావం అక్కడున్న వారిని ఆకట్టుకుంది.
Read Also: Cult Teaser Release: ‘కల్ట్’ టీజర్ చూసారా?
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యర్నేని, వై. రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, టీ-సిరీస్ సమర్పిస్తోంది. 2024 సంక్రాంతి బ్లాక్‌బస్టర్ ‘హనుమాన్’కు కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌తో భారతీయ సంస్కృతి, పురాణ గాథలను ప్రపంచానికి పరిచయం చేసేలా సినిమాను రూపొందించనున్నట్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలిపారు.
గౌర హరి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని చిత్రబృందం వెల్లడించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: