📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Breaking News: Ibomma: ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్..

Author Icon By Tejaswini Y
Updated: November 15, 2025 • 11:03 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’(Ibomma) నిర్వాహకుడు ఇమ్మడి రవిని కూకట్‌పల్లి సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూకట్‌పల్లి ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఆయనను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. నిన్న అంటే నవంబర్  14వ తేదీన ఇమ్మడి రవి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్(hyderabad) కు వచ్చాడు.

Read Also:  BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం?

కరేబియన్ దీవుల్లో నివసిస్తూ అక్కడినుంచే ఐబొమ్మ(Ibomma) వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నాడని విచారణలో తెలిసింది. ఈ సైట్ ద్వారా కొత్త సినిమాలను పైరసీ రూపంలో విడుదల చేయడంతో సినీ పరిశ్రమకు భారీ నష్టం జరుగుతోందని నిర్మాతలు పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దమ్ముంటే పట్టుకోండి అంటూ సవాల్

గతంలో “దమ్ముంటే పట్టుకోండి” అంటూ సవాల్ కూడా చేశాడు. భార్యతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నాడని విచారణలో వెల్లడైంది. అతని ఖాతాల్లో ఉన్న రూ.3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేయగా, సర్వర్లలో ఉన్న మూవీ ఫైళ్లను కూడా అధికారులు పరిశీలించారు. థియేటర్లలో లేదా ఓటీటీలో సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే ఐబొమ్మలో అందుబాటులోకి వస్తుండటంతో నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు.

ఇమ్మడి రవిని సోమవారం మీడియా ముందుకు తీసుకువచ్చి మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టుతో ఐబొమ్మ వెబ్‌సైట్ భవితవ్యం ఏంటన్నది విచారణ తరువాత స్పష్టమవుతుంది. వెబ్‌సైట్ పూర్తిగా మూసివేయబడిందా లేదా తాత్కాలికంగా నిలిపివేసారా అన్న అంశంపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

HyderabadPolice IbommaArrest IbommaWebsite ImmadhiRavi TeluguFilmIndustry

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.