📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

Raviteja : రవితేజ మారినట్లేనా..?

Author Icon By Sudheer
Updated: November 12, 2025 • 11:28 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మాస్ మహారాజా రవితేజ కెరీర్ ప్రస్తుతం కీలక మలుపులో ఉంది. ఎప్పటినుంచో కమర్షియల్ సినిమాలకే కేరాఫ్‌గా ఉన్న రవితేజ, ప్రేక్షకుల అభిరుచుల్లో వచ్చిన మార్పును ఇప్పుడు స్పష్టంగా గమనిస్తున్నాడు. గతంలో రవితేజ సినిమాలు అంటే ఫైట్లు, మాస్ డైలాగులు, సాంగ్స్, కామెడీ ఇవన్నీ ప్యాకేజ్‌గా ఉండేవి. కానీ ప్రస్తుతం ప్రేక్షకులు కొత్తదనం కోసం ఎదురుచూస్తున్నారు. స్టోరీలో ట్విస్ట్ లేకుండా, కొత్త పాయింట్ లేకుండా వచ్చే సినిమాలను తిప్పికొడుతున్నారు. ఈ మార్పు రవితేజకు మొదట తెలియకపోయినా, వరుస ఫ్లాపులు ఎదుర్కొన్న తర్వాత ఆ లోపం అర్థమైంది. అందుకే ఇప్పుడు ఆయన తన కెరీర్‌పై గంభీరంగా ఆలోచిస్తూ, అభిమానులు, స్నేహితులు, ఇండస్ట్రీలోని సన్నిహితుల సలహాలను వినడం ప్రారంభించాడు.

Jubilee Hills By Election Exit Poll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏ పార్టీ గెలవబోతుందో చెప్పిన ఎగ్జిట్ పోల్స్

తాజాగా రవితేజ నటిస్తున్న చిత్రం భర్త మహాశయులకో విజ్ఞప్తి ఈ మార్పుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఈ సినిమా గ్లింప్స్‌ చూస్తే రవితేజ సాధారణ మాస్ యాక్షన్ స్టయిల్‌కి విరుద్ధంగా, క్లాస్ టచ్‌తో కూడిన ఫన్ డ్రామాగా రూపొందుతోందని స్పష్టంగా తెలుస్తోంది. ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగే హీరో కథలు కొత్తవి కాకపోయినా, రవితేజ దృష్టిలో ఇది కొత్త ఎక్స్‌పీరిమెంట్‌గా భావించవచ్చు. ఈ సినిమా నుంచే ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్‌లో జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన కొన్ని ప్రాజెక్టులపై పునరాలోచన చేస్తూ, ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా స్క్రిప్ట్ మార్పులు చేయాలని భావిస్తున్నాడు. ఈ జాగ్రత్తతో రవితేజ తన కెరీర్‌ను కొత్త దిశలో నడిపించే అవకాశం ఉంది.

అదేవిధంగా రవితేజ గురించి పరిశ్రమలో ఉన్న మరో అభిప్రాయం — తను రెమ్యునరేషన్ కోసం మాత్రమే సినిమాలు చేస్తున్నాడన్నది. కానీ ఇప్పుడు ఆ ఇమేజ్‌ కూడా మార్చాలని ఆయన ప్రయత్నిస్తున్నాడు. భర్త మహాశయులకో విజ్ఞప్తి చిత్రానికి ఆయన పారితోషికం తీసుకోకుండా, సంక్రాంతికి విడుదల చేయాలన్న షరతుతో ఒప్పుకున్నట్లు సమాచారం. సినిమా లాభాల్లో వాటా పొందే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇది రవితేజలో వచ్చిన ఆత్మపరిశీలనకు సంకేతంగా కనిపిస్తోంది. ద‌ర్శ‌కులు కూడా పాత టెంప్లేట్ల నుంచి బయటకు వచ్చి, కథల్లో కొత్తదనం తీసుకురావాలనే అవసరం ఉంది. రవితేజ ఈ దిశగా ముందడుగు వేస్తే, భవిష్యత్తులో ప్రేక్షకులు ఆయన నుంచి నిజమైన మాస్‌తొ కూడిన కొత్త తరహా సినిమాలు చూడగలరని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Google News in Telugu Latest News in Telugu RaviTeja raviteja movies

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.